రివ్యూ : గ్యాంగ్ – ఆకట్టుకునే గ్యాంగ్..

టైటిల్ : ‘గ్యాంగ్ ‘ (2017)
స్టార్ కాస్ట్ : సూర్య , కీర్తి సురేష్ , రమ్య కృష్ణ తదితరులు…
దర్శకత్వం : విఘ్నేష్ శివ‌న్‌
నిర్మాతలు: యూవీ క్రియేషన్స్
మ్యూజిక్ : అనిరుద్
విడుదల తేది : జనవరి 12, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

రివ్యూ : గ్యాంగ్ – ఆకట్టుకునే గ్యాంగ్..

తమిళ్ తో పాటు తెలుగు లో గుర్తింపు పొందిన సూర్య…తాజాగా గ్యాంగ్ పేరుతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుస సక్సెస్ చిత్రాలను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ వారు తెలుగు లో రిలీజ్ చేయడం తో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. అంతే కాకుండా మొదటిసారి సూర్య తెలుగు లో డబ్బింగ్ చెప్పడం తో ఈ మూవీ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో పెరిగింది. మరి సూర్య ..గ్యాంగ్ పేరుతో ఏం చేసాడో ఇప్పుడు తెలుసుకుందాం.

కథ :

తిలక్ (సూర్య ) చిన్నప్పటి నుండి సీబీఐ ఆఫీసర్ కావాలని డ్రీం. ఈ నేపథ్యం లో సీబీఐ అధికారి అవినీతికి పాల్పడుతుండగా చూసిన తిలక్ ఆ విషయాన్నీ ఫై అధికారులకు చెపుతాడు. దాంతో ఆ అధికారి తిలక్ ను సీబీఐ ఆఫీసర్ కాకుండా అడ్డు పడతాడు. దీంతో తిలక్ సొంతంగా ఓ గ్యాంగ్ ను ఏర్పటు చేసుకొని , అవినీతి ఫై యుద్ధం చేస్తాడు. అవినీతికి పాల్పడి డబ్బు దోచుకునే వారి దగ్గరి నుండి డబ్బు దోచుకుంటూ మంచి పనులు చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ ఆఫీసర్స్ ..తిలక్ గ్యాంగ్ ను ఏం చేస్తారు..? సీబీఐ ఆఫీసర్స్ నుండి తిలక్ గ్యాంగ్ ఎలా తప్పించుకుంటారు..? అనేది మిగతా కథ.

Also Read :   రివ్యూ : '2 కంట్రీస్' - బోరింగ్ కంట్రీస్..

ప్లస్ :

* సూర్య యాక్టింగ్

* కథలో మెసేజ్

* రమ్య కృష్ణ రోల్

* సెకండ్ హాఫ్

మైనస్ :

* మ్యూజిక్

* ఫస్ట్ హాఫ్

* అక్కడక్కడా తెలుగు నెగిటివిటీ తగ్గడం

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ముందుగా సూర్య గురించి చెప్పుకోవాలి..ఓ సాధారణ యువకుడిగా, గ్యాంగ్‌కు లీడర్‌గా చక్కటి నటన కనబరిచాడు. ఫైట్స్ , డాన్స్ లలో అభిమానులను ఆకట్టుకున్నాడు.

* కీర్తి సురేష్ పాత్ర కు పెద్దగా ప్రాధాన్యం లేదు. కేవలం రెండు , మూడు సన్నివేశాలు , పాటలకు మాత్రమే పరిమితం అయ్యింది.

* బుజ్జమ్మ పాత్రలో రమ్యకృష్ణ ఆకట్టుకుంది.

* మిగతా వారి పాత్రలకు తగట్టే వారు నటించారు.

Also Read :   రివ్యూ : జవాన్ - ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా

సాంకేతిక విభాగం :

* అనిరుద్ మ్యూజిక్ యావరేజ్ గా ఉంది..

* దినేశ్‌‌ కృష్ణన్‌ సినిమా ఫోటోగ్రఫి సినిమాకు ప్రాణం పోసింది.

* శ్రీకర్‌ప్రసాద్‌ ఎడిటింగ్‌ బాగానే ఉంది.

* దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ఈ సినిమాను తమిళ నేటీవిటికి దగ్గరగా మలిచాడు. పాటల చిత్రీకరణ, కొన్ని సన్నివేశాల్లో తెలుగు నెగిటివిటి తగ్గినట్లు కనిపించింది.

చివరిగా :

ప్రభుత్వ అధికారులు తమ విధులు మరచిపోయి , అవినీతికి పాల్పడుతూ పేద వారి సొమ్మును ఎలా కాజేస్తున్నారు..వారిని నిరుద్యోగ యువత ఎలా అడ్డుకుంటారనేది సినిమాలో చూపించాడు డైరెక్టర్.. 1987 నేపథ్యంలో జరిగే కథ ఇది. కాకపోతే 2018 తరహాలో చూపించాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ అంత కూడా హీరో కు సంబదించిన సన్నివేశాలతో సాగదీసాడు. సెకండ్ హాఫ్ లో హీరో ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు.. నకిలీ సీబీఐ గ్యాంగ్‌ ఏర్పడి అక్రమంగా ఆస్తులు కూడపెడుతున్న వారి దగ్గరినుండి డబ్బులు లాకోవడం , అవి మంచి పనులకు ఉపయోగించడం వంటివి చేసి మంచి మెసేజ్ ఇచ్చాడు. ఓవరాల్ గా సంక్రాంతి బరిలో వచ్చిన మిగతా సినిమాలతో పోలిస్తే ఇది చాల బెటర్ సినిమా.

Tagged: , , , , ,