రివ్యూ : గౌతమీపుత్ర శాతకర్ణి – బాలకృష్ణ మేనియా

టైటిల్ : గౌతమీపుత్ర శాతకర్ణి (2017)
స్టార్ కాస్ట్ : బాలకృష్ణ , హేమమాలిని, శ్రేయ శరన్, కబీర్ తదితరులు.
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : క్రిష్
నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు
మ్యూజిక్ : చిరంతన్ భట్
విడుదల తేది : జనవరి 12, 2017
తెలుగు మిర్చి రేటింగ్ : 3.75/5

రివ్యూ : గౌతమీపుత్ర శాతకర్ణి – బాలకృష్ణ మేనియా

GPS-Telugu-Review

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా మాత్రమే కాక, అఖండ భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక మహారాజు “శాతకర్ణి” జీవితం ఆధారంగా తెరకెక్కిన ,అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. నందమూరి అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా అభిమానులందరూ కూడా ఈ చిత్రం ఫై భారీ గా అంచనాలు పెట్టుకున్నారు..

“శాతకర్ణి”గా నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహార్యం తెలుగువారిని అమితంగా ఆకట్టుకునేలా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ఆశ్చర్యచకితుల్నిచేయగా చిరంతన్ భట్ స్వరపరిచిన బాణీలతే సంగీత ప్రియులను విశేషంగా అలరించాయి..దీంతో సినిమా ఎలా ఉండబోతుందో అనే ఊహాగానాలు ఎక్కవయ్యాయి..మరి అభిమానుల అంచనాలు ..తెలుగు ప్రేక్షకుల ఊహాగానాలను అందుకోవడం లో శాతకర్ణి ఎంత వరకు సక్సెస్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

కథ :

సింపులు గా కథ చెప్పాలంటే ..అఖండ భారతదేశాన్ని తన పరిపాలనా సాగాలని అనుకున్న తెలుగు చక్రవర్తి
శాతకర్ణి..ఆలా అన్ని రాజ్యాలపై యుద్దాలు చేస్తూ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటాడు..ఈ నేపథ్యం లో అలెగ్జాండర్‌ కలలుగన్న అఖండభారతాన్ని చేజిక్కుంచుకోవాలని గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్‌ సింధు నుంచి పోరాటానికి దిగుతాడు. ఈ నేపథ్యం లో శాతకర్ణిపై విషప్రయోగానికి పూనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది.. గ్రీకు చక్రవర్తి ని ఎలా ఓడించాడు..? అనేది మిగతా కథ..

ప్లస్ :

* శాతకర్ణి గా బాలకృష్ణ నటన

* కథ – స్క్రీన్ ప్లే

* దర్శకత్వ ప్రతిభ

* విజువల్ ఎఫెక్ట్స్

మైనస్ :

* ఇలాంటి కథలకు మైనస్ అనేది పెద్దగా చెప్పడం కాస్త కష్టం ..

* బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఒక భైరవ ద్వీపం చేయాలన్న , లేదా ఆదిత్య 369 లాంటి సోషల్ వండర్ చేయాలన్న ఇక శాతకర్ణి లాంటి తెలుగు చక్రవర్తి రోల్ చేయాలన్న ఒక్క నందమూరి బాలకృష్ణ కే చెల్లుతుందని మరోసారి ఈ మూవీ తో నిరూపించాడు..శత్రువులను వేటడంలోనే కాదు సామ్రాజాన్ని పరిపాలించడం లో కూడా తన అద్భుత నటనను కనపరిచాడు. బాలకృష్ణ నటవిశ్వరూపం చూపించాడు అని చెప్పడం లో ఎలాంటి సందేహం అవసరం లేదు. సినిమాలో ఆయన పలికిన డైలాగులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి..చక్రవర్తిగా రాజసం ఉట్టిపడేలా బాలయ్య కనిపించాడు.

* బాలకృష్ణ తల్లి గౌతమి బాలశ్రీ గా నటించిన బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినీ రోల్ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది..చాల కాలం తర్వాత హేమ మాలిని తెలుగు చిత్రం లో కనిపించి , అందులోను ఇలాంటి ఎప్పటికి గుర్తుండి పోయే పాత్రలో కనిపించడం అందరికి సంతోషం కలిగించింది.

* వశిష్ఠ దేవి గా శ్రియ హీరోయిన్ గా కనిపించి అందరిని ఆకట్టుకుంది..తన నటన తో పాటు అందాలతో కూడా మరోసారి తెలుగు ఆడియన్స్ ను కట్టిపడేసింది.

* కాళహస్తీశ్వరా రోల్ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించి సినిమాకు అదనపు అక్షర్షణ గా నిలిచాడు..ఇతడి నటన కూడా ఎంతో బాగుంది..కబీర్ బేడీ మొదలగు నటి నటులు తమ పరిధి లో బాగా చేసారు.

సాంకేతిక విభాగం :

ముందుగా సినిమాటోగ్రఫీ జ్ణానశేఖర్ గురించి చెప్పుకోవాలి..భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక మహారాజు “శాతకర్ణి” జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాన్ని వెండితెర ఫై ఎలా చూపిస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో…ఎలా థ్రిల్ గా ఫీల్ అవుతారో చక్కగా తెలుసుకొని దర్శకుడు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం లో ఎంతో సక్సెస్ అయ్యాడు.

* ఇక సంగీత దర్శకుడు చిరంతన్ భట్ విషయానికి వస్తే , ముందుగా ఈ చిత్రానికి దేవి శ్రీ అనుకున్నప్పటికీ ఆ తర్వాత చిరంతన్ భట్ ను తీసుకున్నారు..గతం లో క్రిష్ తెరకెక్కించిన కంచె చిత్రానికి కూడా ఇతనే మ్యూజిక్ అందించాడు..క్రిష్ టెస్ట్ కు తగట్టు మ్యూజిక్ ఇవ్వడం లో దిట్ట అనిపించుకున్నాడు..చారిత్రాత్మక నేపథ్యం లో సాగే సినిమా కావడం తో దానికి ఎలాంటి మ్యూజిక్ ఇస్తే బాగుంటుందో..ఎంతో చక్కగా శాతకర్ణి కి ఇచ్చి సక్సెస్ అయ్యాడు..బాక్గ్రౌండ్ స్కోర్ కాస్త అటూఇటూ అనిపించింది..

* ఇక డైలాగ్స్ చూస్తే సాయి మాధవ్ బుర్ర తనలో రచన నేపుణ్యాన్ని మరోసారి రుజువు చేసాడు.

‘గౌతమిపుత్ర శరణమా.. మరణమా’ అనే డైలాగ్ ..”విరామం లేదు విశ్రాంతి లేదు.
నా కత్తికంటిన నెత్తుటి చార ఇంకా పచ్చిగానే వుంది..
సమయం లేదు మిత్రమా,
శరణమా.. రణమా ?” అని ..

‘ప్రసవ వేదనలో తల్లి ఏడుపు వినం.. కానీ బిడ్డ ఏడుపు వింటాం’, ‘సింహం, చీమ యుద్ధంలో వెనుదిరగవు.. సింహం చచ్చేవరకు పట్టి పట్టి చంపుతుంది, చీమ అది చచ్చే వరకు కుట్టి కుట్టి చంపుతుంది’, ‘పాలించటానికి కాదు ఈ గడ్డ మీద యాచించడానికి కూడా గ్రీసస్థులకి అర్హత లేదని చెప్పు’ అనే డైలాగ్స్ అమోగం.

* ఇక పోరాట సన్నివేశాల గురించి మాట్లాడుకుంటే రామ్-లక్ష్మణ్ ఎంతో స్టైలిష్ గా తెరకెక్కించారు..యుద్ధ సన్నివేశాలు , గుర్రపు స్వారీలు వంటివి ఎంతో చక్కగా బాలకృష్ణ తో చేయించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం బాగుంది…

* నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి..ఇలాంటి చారిత్రత్మక సినిమా తీయాలంటే ముందుగా పెట్టుబడి పెట్టడానికి ధైర్యం ఉండాలి..ఎందుకంటే ప్రేక్షకులకు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కాబట్టి కాస్త ప్రొడ్యూసర్స్ వెనుకడుగు వేస్తారు..కానీ వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు లు మాత్రం ఎక్కడ తగ్గకుండా భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మించారు..అన్ని విభాగాల్లో అబ్బురపరిచారు..

* సినిమా..సినిమాకు వేరియేషన్ చూపిస్తూ వైవిధ్యంగా తీసే దర్శకుడు క్రిష్. గమ్యం నుంచి గౌతమిపుత్ర శాతకర్ణిదాకా అతడు అనుసరించిన పంథా వేరు. తీసుకున్న కథలు, కథనాలు డిఫరెంట్..మానవసంబంధాలు గురించి ఎంతో చక్కగా చూపించే క్రిష్.. శాతవాహన మహారాజు “శాతకర్ణి” జీవితం ఆధారంగా క్రిష్ ఈ మూవీ ఎంతో చక్కగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. మేకింగ్‌లో క్రిష్ అత్యున్నత స్థానాన్ని అందుకున్నారని, తెలుగు సినీ పరిశ్రమల్లో ఉన్న గొప్ప దర్శకుల జాబితాలో ఆయన చేరిపోయాడని సినిమా చూస్తే ఎవరైనా ఈ మాటే అంటారు. క్రిష్ గత చిత్రాలతో పోల్చుకుంటే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ టేకింగ్ అద్భుతంగా ఉంది.

చివరిగా :

తెలుగు జాతి గొప్ప‌తనాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాతకర్ణి నేప‌థ్యంలో సాగే కథ కావడం తో సినిమా అంత కూడా యుద్ధాలతో సాగిపోతుంది..ఇలాంటి కథలు ఒక్క బాలయ్య మాత్రమే చేయగలడని నిరూపించాడు. డైరెక్టర్ క్రిష్ సైతం ప్రేక్షకులు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. 12కోట్ల మంది తెలుగువారు గర్వపడేలా సినిమాను రూపొందించాడు. విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రాణం పోశాయి..అలాగే సాయి మాధవ్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి..ఇక సాధారణ జనాలకు సినిమా ఎలా ఆకట్టుకుంటుంది అనేది చూడాలి..

Tagged: , ,