రివ్యూ : ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం

టైటిల్ : ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం (2016)
స్టార్ కాస్ట్ : అల్లరి నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, కృతిక..తదితరులు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : జి.నాగేశ్వరరెడ్డి
నిర్మాతలు: బివిఎస్ఎన్. ప్రసాద్
మ్యూజిక్ : సాయి కార్తీక్‌
విడుదల తేది : డిసెంబరు 30, 2016
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

రివ్యూ : ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం – భయపెట్టలేకపోయిన దెయ్యం..

idnb-telugu-review

ప్రస్తుతం హర్రర్ & కామెడీ చిత్రాలకు ఎలాంటి ఆదరణ చేకూరుతుందో మనం చూస్తూనే ఉన్నాం..ప్రేమకథ చిత్రం నుండి మొదలు పెడితే నిన్నటి ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాల వరకు అన్ని మంచి హిట్స్ సాధించి , కాసుల వర్షం కురిపించాయి..దీంతో గత కొన్ని ఏళ్లుగా హిట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ కూడా హర్రర్ కథను నమ్ముకొని హిట్ కొట్టాలని ‘ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం’ అనే మూవీ ని నమ్ముకున్నాడు..ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పెద్ద చిత్రాల రిలీజ్ , ఆ తర్వాత పెద్ద నోట్ల ప్రభావం తో రిలీజ్ కు వాయిదా పడుతూ , ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కామెడీ కథలను తెరకెక్కించడం లో దిట్ట అయినా జి.నాగేశ్వరరెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా అత్తారింటికి దారేది , నాన్నకు ప్రేమతో వంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ మూవీ ని నిర్మించడం విశేషం..మరి అల్లరోడికి దెయ్యం ఏ మాత్రం కలిసివచ్చిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

నరేష్ ( అల్లరి నరేష్ ) తన ఫ్రెండ్స్ తో కలిసి పెళ్లిళ్లకు బ్యాండ్ మేళం వాయిస్తూ జీవితం సాగిస్తుంటాడు.ఓ రోజు అనాధలకు సాయం చేస్తున్న ఇందుమ‌తి(కృతిక‌)ని చూసి ఫస్ట్ చూపులోనే ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు..ఎలాగైనా ఇందుమతి దృష్టిలో పడాలని ఏ అనాథకు సాయం చేయాల‌ని మూడు ల‌క్ష‌లు అప్పు చేస్తాడు. అనుకోకుండా ఆ డబ్బు పోతుంది..

దీంతో ఆ అప్పు ఎలా తీర్చాలనే టైం లో గోపాలం (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) నరేష్ కు ఫోన్ చేసి , తన ఇంట్లో దెయ్యాన్ని బయటకు పోగొడితే ఎంత డబ్బయినా ఇస్తానని చెప్పడం తో నరేష్ మాంత్రికుడి విషయం లో ఆ ఇంటికి వెళ్లి దెయ్యాన్ని పోగొట్టానని చెప్పి కొంత డబ్బు తీసుకుంటాడు..ఆ తర్వాత మళ్లీ ఆ ఇంట్లో దెయ్యం కనిపించడం తో నరేష్ ను పిలిపిస్తాడు గోపాల్…ఆ తర్వాత ఏం జరిగింది..? గోపాలం కు ఆ దెయ్యానికి సంబంధం ఏంటి..? నరేష్ ఎలా ఈ గండం నుండి బయటపడతాడు..? ఇందుమతి ప్రేమను నరేష్ పొందుతాడా లేడా..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* అల్లరి నరేష్ కామెడీ

* ఫస్ట్ హాఫ్

* నరేష్ – కృతిక‌ లవ్ ట్రాక్

మైనస్ :

* సెకండ్ హాఫ్

* రొటీన్ స్టోరీ

* దెయ్యం క్యారెక్టర్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

ఎప్పటిలాగానే నరేష్ తన కామెడీ తో ఫస్ట్ హాఫ్ అలరించాడు..కృతిక తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది..గోపాలం రోల్ రాజేంద్రప్రసాద్‌ తన పరిధి మేరకు బాగానే నవ్వించాడు. దెయ్యం క్యారెక్టర్ లో మౌర్యాని పర్వాలేదు అనిపించింది కానీ పూర్తి మార్కులు వేసుకోలేక పోయింది. ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం హావ బాగా తగ్గిందని చెప్పనవసరం లేదు..ఈ మూవీ లో కూడా బ్రమ్మి కామెడీ పండకపోగా చిరాకు తెప్పిస్తుంది.

పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్‌, ధన్‌రాజ్‌, ప్రగతి, రజిత, అమిత్‌, టార్జాన్‌, జయవాణి, అపూర్వ, ఆజాద్‌ వారి పాత్రలకు మేరకు బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

మ్యూజిక్ విషయానికి వస్తే సాయి కార్తీక్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నేపధ్య సంగీతం కూడా మామూలుగానే ఉంది. దాశ‌ర‌థి శివేంద్ర అందించిన సినిమాటోగ్ర‌ఫీ సినిమాకి కాస్త ప్రాణం పోసింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ కూడా సెకండ్ హాఫ్ లో తేలిపోయింది..డైమండ్‌ రత్నబాబు
డైలాగ్స్ కూడా పెద్దగా పేలలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా :

నరేష్ హర్రర్ సినిమాని నమ్ముకొని సక్సెస్ కొడతాం అనుకున్నాడు కానీ కథని కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తే బాగుండేది..పాత కథనే నమ్ముకొని మరోసారి బాక్స్ ఆఫీస్ బరిలో నిరాశ పరిచాడు..ఆత్మలు పగ పట్టడం , ఏదో ఒక రూపం లో వచ్చి వారి ఫై పగ తీర్చుకోవడం లాంటి కథలను మనం చాల సినిమాల్లోనే చూసాం అదే కథను రాసుకొని తెరకెక్కించాడు జి.నాగేశ్వరరెడ్డి..ఫస్ట్ హాఫ్ కామెడీ తో సాగించిన , సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి బోర్ కొట్టించాడు. మొత్తానికి ఇంట్లో దెయ్యం బయపెట్టలేకపోయింది.

Tagged: , ,