రివ్యూ : జై సింహ – గర్జించిన బాలయ్య

టైటిల్ : ‘జై సింహ‘ (2017)
స్టార్ కాస్ట్ : బాలకృష్ణ, నయనతార, న‌టాషా దోషీ, హరిప్రియ, ప్రకాష్ రాజ్ తదితరులు…
దర్శకత్వం :కె ఎస్ రవికుమార్
నిర్మాతలు: సి కళ్యాణ్
మ్యూజిక్ : చిరంతన్ భట్
విడుదల తేది : జనవరి 12, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

రివ్యూ : జై సింహ – గర్జించిన బాలయ్య

నందమూరి అభిమానులకు సంక్రాంతి పండగా అంటే భలే ఇష్టం. ఎందుకంటే సంక్రాంతి బరిలో వచ్చిన బాలకృష్ణ చిత్రాలు చాల వరకు హిట్స్ గా నిలిచాయి. అందుకే అభిమానులంతా సంక్రాంతి సెంటిమెంట్ గా నమ్ముతారు. గత ఏడాది శాతకర్ణి గా బాలయ్య వచ్చి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు జై సింహ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సీనియర్ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ దర్శకత్వం లో న‌య‌న‌తార‌, న‌టాషా దోషి, హ‌రిప్రియ‌ హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ మూవీ ని సి కళ్యాణ్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ , సంక్రాంతి బరిలో విన్నర్ గా నిలిచిందా లేదా..? బాలయ్య ఎలా అలరించాడు..? జై సింహ గా ఏ మేరకు ఆకట్టుకున్నాడనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

న‌ర‌సింహ(బాల‌కృష్ణ‌) త‌న బిడ్డ‌ తీసుకొని త‌మిళ‌నాడులోని కుంభ‌కోణం చేరుకుంటాడు. అక్క‌డ ఆలయ ప్రధాన ధ‌ర్మ‌క‌ర్త (ముర‌ళీమోహ‌న్‌) తో పరిచయం పెంచుకొని , ఆయ‌న ఇంట్లోనే డ్రైవర్ గా చేరతాడు. ఈ నేపథ్యం లో ఆల‌య ఆర్చ‌కుల‌కు, పోలీసుల‌కు జ‌రిగిన గొడ‌వ‌ల్లో న‌ర‌సింహం చొర‌వ తీసుకుని, జిల్లా ఎస్.పితో అర్చ‌కుల‌కు క్ష‌మాప‌ణ చెప్పిస్తాడు. దాంతో ఎస్‌.పి..న‌ర‌సింహంపై ప‌గ పెంచుకుంటాడు. ఓ హత్య కేసులో నరసింహ ను ఇరికించాలని ఎస్.పి చూస్తాడు. అదే సమయం లో గౌరి తన బిడ్డ ను వెతుకుంటూ వైజాగ్ నుండి వస్తుంది..ఆ తర్వాత ఏం జరుగుతుంది..? ఇంతకీ గౌరి ఎవరు..? నరసింహ బిడ్డ ను తీసుకొని కుంభ‌కోణం కు ఎందుకు వస్తాడు..? నరసింహ పై ఎస్. పి పగ తీర్చుకుంటాడా..? లేదా..? అనేది మీరు తెర పై చూడాల్సిందే.

Also Read :   రివ్యూ : 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి' - పాసైయ్యాడు

ప్లస్ :

* బాలకృష్ణ నటన

* డైలాగ్స్

* క్లైమాక్స్

మైనస్ :

* స్క్రీన్ ప్లే

* సెకండ్ హాఫ్

* మ్యూజిక్

* బ్రహ్మానందం కామెడీ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ముందుగా బాలయ్య నటన గురించి చెప్పాలి..50 ప్లస్ కు వచ్చిన కానీ బాలయ్య లో జోరు ఏ మాత్రం తగ్గలేదు. యాంగ్ హీరోలకు పోటీ ఇచ్చే స్థాయి లో డాన్స్ లు , ఫైట్స్ చేస్తూ అలరించాడు. అమ్ముకుట్టి పాట‌లో ఆయ‌న వేసిన స్టెప్పులు, ఎమోష‌న‌ల్ సీన్స్, ఫైట్స్, అక్క‌డ‌క్క‌డా చెప్పే పంచ్ డైలాగులు, ఫ్యామిలీ సీన్స్..ఆక‌ట్టుకున్నాయి.

* నయనతార గత చిత్రాల మాదిరిగానే పద్ధతిగా కనిపించి మార్కులు వేసుకుంది. నటాషా దోషి గ్లామర్‌ పరంగా అదరగొట్టింది. హరిప్రియ మంగ పాత్రలో కాస్త అల్లరి పిల్ల గా కనిపించింది.

* చాలారోజుల తర్వాత బ్రహ్మానందం స్క్రీన్ పై కనిపించిన , తనను వాడుకోవడం డైరెక్టర్ విఫలం అయ్యాడు. సాగదీత కామెడీ గా అనిపించడమే కాదు ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది.

* ప్రకాష్ రాజ్ సెంటిమెంట్ తో ఆకట్టుకున్నాడు.

* మురళి మోహన్ , జయ ప్రకాష్ రెడ్డి మొదలగు నటి నటులు తమ తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు.

Also Read :   రివ్యూ : మళ్లీ రావా - మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది..

సాంకేతిక విభాగం :

* చిరంత‌న్ భ‌ట్‌ మ్యూజిక్ విషయానికి వస్తే ‘అమ్ముకుట్టి ‘ అనే సాంగ్ తప్ప మిగతావన్నీ బోర్ కొట్టించాయి. నేపధ్య సంగీతం కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

* రాంప్ర‌సాద్‌ సినిమా ఫొటోగ్రఫీ ఆకట్టుకుంది. ముఖ్యం ఫైట్స్ సన్నివేశాలు , ఫారిన్ లొకేషన్లు బాగా చూపించారు.

* ఎం.రత్నం మాటలు అదిరిపోయాయి. కానీ కథ మాత్రం పాత పద్ధతి లోనే రాసుకొచ్చాడు.

* రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాగున్నాయి.

* సి. కళ్యాణ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

* డైరెక్టర్ స్క్రీన్ ప్లే కొత్తగా ఏమి లేదు..పాత పద్దతి లో సినిమాను నడిపించాడు. ఫస్ట్ హాఫ్ అంత కుంభ‌కోణం లో నడిపించాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ మాత్రం సెంటిమెంట్ లతో ముందుకు తీసుకెళ్లాడు. ఓ రకంగా చెప్పాలంటే సెంటిమెంట్ ఎక్కువయిందనే చెప్పాలి. బ్రహ్మానందం కామెడీ ఏ మాత్రం నవ్వులు తెప్పించలేకపోయాడు.

చివరిగా :

నందమూరి అభిమానులు బాలయ్య నుండి ఏం కోరుకుంటారో అది ఈ మూవీ లో పుష్కలంగా ఉన్నాయి.
బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌కి, తన పవర్‌ఫుల్ హావభావాలకి, డైలాగ్ డెలివరీకి తగ్గ పాత్రను డిజైన్ చేసాడు డైరెక్టర్.

సెకండ్ హాఫ్ లో బాలకృష్ణ చెలరేగిపోయాడు. ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించే సన్నివేశాలు, మాస్ వెర్రెత్తిపోయే డైలాగ్స్ , ఫైట్స్ బాగా పడ్డాయి. కాకపోతే స్క్రీన్ ప్లే విషయం లో , అలాగే కామెడీ విషయం లో డైరెక్టర్ ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండు. ఓవరాల్ గా సంక్రాంతి బరిలో బాలయ్య గర్జించడాని చెప్పాలి.

Tagged: , , ,