రివ్యూ : మిస్టర్‌ – దారి తప్పాడు.

టైటిల్ :‘ మిస్టర్‌ ‘ (2017)
స్టార్ కాస్ట్ : వరుణ్‌తేజ్‌, లావణ్యత్రిపాఠి, హెబ్బా పటేల్‌ తదితరులు..
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : శ్రీనువైట్ల
నిర్మాతలు: నల్లమలపు శ్రీనివాస్‌(బుజ్జి).. ఠాగూర్‌ మధు
మ్యూజిక్ : మిక్కి జె. మేయర్‌
విడుదల తేది : ఏప్రిల్ 14 , 2017
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

రివ్యూ : మిస్టర్‌ – దారి తప్పాడు.

Mister-telugu-review
వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరో హీరోయిన్లుగా బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లుగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మిస్ట‌ర్‌`. ‘ఆగడు’.. ‘బ్రూస్‌లీ’ పరాజయాల తర్వాత శ్రీనువైట్ల ఈ మూవీ ని తెరకెక్కించడం…లోఫర్ ప్లాప్ తర్వాత వరుణ్ తేజ్ నటించిన చిత్రం కావడం తో ఈ మూవీ ఎలాగైనా హిట్ సాదిస్తుందని మెగా అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. మరి వారి అంచనాలను మిస్టర్ అందుకున్నాడా..? లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

స్పెయిన్‌ లో ఉండే చై (వరుణ్ తేజ్ ) ఇండియా నుండి వస్తున్న ప్రియ అనే అమ్మాయిని రిసీవ్‌ చేసుకోవడానికి ఎయిర్‌పోర్టుకి వెళ్తాడు. కానీ ప్రియా ను రిసీవ్ చేసుకోకుండా మీరా (హెబ్బా పటేల్ ) ను కలుసుకుంటాడు..మొదటి చూపులోనే ఆమెను ఇష్టపడతాడు. కానీ అప్పటికే ఆమె ఇండియా లో ఉంటున్న సిద్ధార్థ్‌ (ప్రిన్స్‌) ను ప్రేమిస్తుంది.

ఈ విషయం చై కి చెప్పి నాల్గు రోజులపాటు అతడి తో కలిసి ఉంటుంది..ఈ నేపథ్యం లో వారిద్దరూ బాగా దగ్గరవుతారు. ఈ లోపు మీరా ఇండియా కు వెళ్ళేతుంది..ఆలా ఇండియా కు వెళ్లిన ఆమె చై కి ఫోన్ చేసి తన ప్రేమ ఇబ్బందుల్లో ఉందని సాయం చేయమని అడుగుతుంది…దాంతో చై ఇండియా కు వస్తాడు..ఆ తర్వాత ఏం జరుగుతుంది..? చై జీవితం లోకి చంద్రముఖి (లావణ్య త్రిపాఠి ) ఎలా వస్తుంది..? మీరా – సిద్దార్థ్ ప్రేమకు ఎవరు అడ్డు పడతారు..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ :

* సినిమా ఫోటోగ్రఫీ

* నిర్మాణ విలువలు

* లిడ్ రోల్స్

మైనస్ :

* కథ – కథనం

* సెకండ్ హాఫ్

* సాగతీత సన్నివేశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

వరుణ్ తేజ్ నటనలో కాస్త డిఫరెంట్ కనిపించింది..డాన్స్ , సెంటిమెంట్ సీన్స్ లలో పర్వాలేదు అనిపించాడు. అమాకత్వం, ప్రేమ, బాధ, భయం ఇలా అన్ని రకాల ఎమోషన్స్ లావణ్య త్రిపాఠి ప్రదర్శించి ఆకట్టుకుంది. హెబ్బా పటేల్ కూడా అందంతో పాటు నటనతోనూ ఓకే అనిపించింది. విలన్ రోల్ లో నటించిన నికితిన్ ధీర్ సినిమా కు హైలైట్ అయ్యాడు.

పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌ కామెడీ పర్వాలేదు. నాజ‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, ర‌ఘుబాబు, ఆనంద్‌, నాగినీడు, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌ మొదలగు నటి నటుల నటన వారి పాత్రల మేరకు చేసారు.

సాంకేతిక విభాగం :

ముందుగా సినిమా ఫోటోగ్రఫి అందించిన గుహన్‌ గురించి చెప్పుకోవాలి..సినిమా కు ప్రధాన హైలైట్ గా తన పనితీరు నిలిచింది. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఓకే అనిపించింది.నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ విషయం లో ఇంకాస్త ఎం.ఆర్‌ వర్మ శ్రద్ద పెడితే బాగుండు.

గోపీ మోహన్‌ అందించిన కథ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది..సినిమా చూసినంత సేపు ఏదో పాత సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. శ్రీధర్‌ సీపాన మాటలు కూడా నామమాత్రంగానే ఉన్నాయ్..ఇక డైరెక్టర్ శ్రీను వైట్ల విషయానికి వస్తే ఆగడు..బ్రూస్ లీ దెబ్బ తో కాస్త మారుతాడు అని అంత అనుకున్నారు కానీ అతడి లో పెద్దగా మార్పులేవీ కనిపించలేదు. సినిమా అంత ఫస్ట్ హాఫ్ లోనే చూపించాడు..సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి ప్రేక్షకుడికి తర్వాత జరిగేది తెలిసిపోయేలా చూపించాడు..కన్‌ఫ్యూజన్‌ కామెడీ, పేరడి చేసినప్పటికీ ప్రేక్షకుడిని మాత్రం ఆకట్టుకోలేక పోయాడు.

చివరిగా :

గుహన్ సినిమా ఫోటో గ్రఫీ..మిక్కీ మ్యూజిక్..లావణ్య , హెబ్బా గ్లామర్ ఆకట్టుకున్నప్పటికీ..సినిమాలో కావాల్సిన కథ ను అందించడం లో మిస్టర్ యూనిట్ విఫలం అయ్యింది. వరుణ్ తేజ్ బాగానే కష్టపడ్డాడు కానీ కథ ఎంపిక లో ఇంకాస్త శ్రద్ద పెడితే మిస్టర్ అందరి చేత ఫర్ఫెక్ట్ అనిపించుకునే వాడు..శ్రీను వైట్ల డైరెక్షన్ ఎప్పటి మాదిరిగానే ఉండడం..ఫస్ట్ హాఫ్ లో అసలు స్టోరీ రివీల్ కావడం తో సెకండ్ హాఫ్ కథ ఏంటి అనేది ముందుగానే ప్రేక్షకుడు ఉహించాడు..ఇంకాస్త కథ లో మార్పులు చేస్తే బాగుండు అనిపించింది. మరి ఈ మిస్టర్ ఎంతవరకు నిలబడతాడు అనేది చూడాలి.

Tagged: , , , , , ,