రివ్యూ : నా పేరు సూర్య – హైప్ ఎక్కువ , మేటర్ తక్కువ

స్టార్ కాస్ట్ : అల్లు అర్జున్ , అను ఇమ్మాన్యుయేల్‌, అర్జున్‌, శ‌ర‌త్‌కుమార్‌ తదితరులు..
దర్శకత్వం : వక్కంతం వంశీ
నిర్మాతలు: రామలక్ష్మి క్రియేషన్స్
మ్యూజిక్ : విశాల్ శేఖర్
విడుదల తేది : మే 04, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : రివ్యూ : నా పేరు సూర్య – హైప్ ఎక్కువ , మేటర్ తక్కువ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

కిక్, టెంపర్, ఎవడు, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కథలను అందించి రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ, మొదటిసారి ఈ మూవీ తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుండడం , అల్లు అర్జున్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ గా కనిపించడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల రిలీజ్ అయినా ట్రైలర్స్ , ప్రోమో సాంగ్స్ మొదలగున్నవి అన్ని కూడా సినిమాకు పాజిటివ్ బజ్ ను తీసుకొచ్చాయి. మరి అభిమానులు పెట్టుకున్న అంచనాలను సూర్య అందుకున్నాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

సూర్య (అల్లు అర్జున్ ) ఆర్మీ సైనికుడు..ఎదుటి వారు తప్పు చేస్తే అసలు ఊరుకునే వాడు కాదు..దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని వ్యక్తి. ఈ నేపథ్యం లో సైనిక నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఒక‌సారి ఓ ఉగ్ర‌వాదిని కాల్చి చంపేస్తాడు. దీంతో సూర్య ఫై అతని ఫై ఆఫీసర్ సీరియస్ అవుతాడు. ఆర్మీలో నువ్వు పనికిరావని సూర్య ను ఆర్మీ నుండి బయటకు పంపిస్తాడు.

కానీ ఆర్మీ నుండి వెళ్లడం ఇష్టం లేని సూర్య త‌న గాడ్ ఫాద‌ర్ (రావు ర‌మేశ్‌)ను సలహా తీసుకుంటాడు. వైజాగ్‌లో ఉన్న ర‌ఘురామ‌కృష్ణంరాజు (అర్జున్‌) అనే సైక్రియాట్రిస్ట్ ద‌గ్గ‌రకు వెళ్లి ఓ స‌ర్టిఫికెట్ తీసుకుని ర‌మ్మ‌ని చెబుతారు. దాంతో వైజాగ్‌కి వ‌స్తాడు సూర్య..ఆలా వచ్చిన సూర్య వ‌ర్ష (అను ఇమ్మాన్యుయేల్‌) ప్రేమలో పడతాడు.

ఇదే టైం లో వైజాగ్ లో చల్లా(శరత్‌ కుమార్‌) చేసే అరాచకాలు చూసి రగిలిపోతాడు సూర్య . దేశ సరిహద్దులోని కాదు దేశంలో ఉన్న చెడును అంతం చేయాలనీ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? చల్లా అరాచకాలను ఎలా ఎదురిస్తాడు..? ర‌ఘురామ‌కృష్ణంరాజు కు సూర్య కు ఉన్న సంబంధం ఏంటి..? సూర్య మళ్లీ ఆర్మీ లో చేరతాడా..లేదా..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.

Also Read :   రివ్యూ : మహానటి - అందరూ మెచ్చే నటి

ప్లస్ :

* అల్లు అర్జున్ యాక్టింగ్

* సినిమా ఫొటోగ్రఫీ

* యాక్షన్ సన్నివేశాలు

మైనస్ :

* ఫస్టాఫ్ మరియు సెకండాఫ్ లో సాగతీత సన్నివేశాలు

* ఆర్మీ సన్నివేశాలు పెద్దగా లేకపోవడం

* మ్యూజిక్

* ప్రతినాయకుడి పాత్ర బలంగా లేకపోవడం

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* తన ప్రతి చిత్రంలోనూ కొత్తదనం చూపించే అల్లు అర్జున్.. ‘నా పేరు సూర్య’లో కూడా డిఫరెంట్ లుక్‌తో కనిపించాడు. కండలు తిరిగిన బాడీ, ఆకట్టుకునే హెయిర్‌స్టైల్, ఆర్మీ దుస్తుల్లో బన్నీ లుక్ అందరికి నచ్చుతుంది. ఫస్ట్‌ సీన్‌ నుండి ఫైట్స్‌, డాన్సుల పరంగా బన్ని క్యారెక్టర్‌ను అద్భుతంగా పండించాడు. ఇప్పటి వరకు చేసిన పాత్రలకంటే డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో బన్ని నటన ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

* హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌ రోల్ కేవలం గ్లామర్‌, పాటలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఆమె పాత్రలో పెర్ఫామెన్స్‌కు పెద్దగా స్కోప్‌ లేదు.

* కార్గిల్‌ పోరాటంలో కాలు కోల్పోయిన సైనికుడు ముస్తఫా(సాయికుమార్‌) పాత్ర ఆకట్టుకుంది.

* సూర్య గాడ్‌ ఫాదర్‌గా రావు రమేష్‌ రోల్ చిన్నదే అయినప్పటికీ ప్రేక్షకులను అలరించింది.

* యాక్షన్ అర్జున్‌ సైకాలజీ ప్రొఫెసర్‌గా ఆ రోల్ కు కరెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇప్పటి వరకు అర్జున్‌ చేయనటువంటి తండ్రి పాత్ర ఇదే అని చెప్పవచ్చు.

* న‌దియా, బోమ‌న్ ఇరాని, వెన్నెల‌కిశోర్‌, ప్ర‌దీప్ రావ‌త్‌ మొదలగు వారు వారి వారి పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

* ముందుగా రాజీవ్‌ రవి సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి..సినిమాకు హైలైట్ గా ఈయన పనితనం నిలిచింది. యాక్షన్‌ సన్నివేశాల్లో తన కెమెరా వర్క్ చూపించాడు.

* విశాల్‌ శేఖర్‌ మ్యూజిక్‌ యావరేజ్ గా అనిపించింది. ఉన్నంతలో మూడు సాంగ్స్‌.. ఐ యామ్‌ లవర్‌ ఆల్‌సో…ఇరగ ఇరగ సాంగ్స్‌లో బన్ని స్టెప్పులు కాస్త అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కాస్త బెటర్.

* రాజీవ్‌ ఆర్ట్‌ వర్క్ బాగుంది. కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి) ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో ఇంకాస్త స్పీడ్ చేస్తే బాగుండు.

Also Read :   సూర్య నిరాశ పరిచాడా..?

* రామ్ లక్ష్మణ్ ఫైట్స్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి అనడం లో ఎలాంటి సందేహాలు లేవు.

* రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ వంశీ దగ్గరకు వస్తే..ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాలకు కథలను అందించి స్టార్ రైటర్ అనిపించుకున్నాడు. ఇక మొదటిసారి డైరెక్టర్ గా తన అదృష్టాన్ని ఈ చిత్రం తో పరీక్షించుకున్నారు. ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ను అనుకుని దాని చుట్టూ కథ రాసుకున్నాడు.

ఒక పక్క దేశభక్తి, హీరోయిజమ్‌, లవ్‌ ట్రాక్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఇలా అన్ని బాగానే చూసుకున్నాడు కానీ సెకండ్ హాఫ్ లో కాస్త తడబడ్డాడు. ఆర్మీ నేపథ్యం లో కథ మొదలు పెట్టాడు కానీ దానిని ఎక్కువగా చూపించలేకపోవడం , సెకండ్ హాఫ్ బాగా స్లో గా నడిపియడం తో సినిమా చూసే ప్రేక్షకుడికి బోర్ కొట్టింది. సెకండ్ హాఫ్ లో వంశీ ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండు.

చివరిగా :

ఆర్మీ క్యాంపు నేపథ్యంలో కథ మొదలవడం , హీరో ఓ ఉగ్రవాదిని చంపడం , ఆ తర్వాత హీరోకు ఓ పరీక్ష పెట్టడం , దానికి కోసం వైజాగ్ వెళ్లడం ఇదంతా బాగానే సాగింది. కానీ ఎప్పుడైతే హీరో వైజాగ్ వచ్చాడో అక్కడి నుండి కథ దారి తప్పింది. ఫ్లాట్‌గా సినిమాకు ముగింపు ఇవ్వడం సినిమా చూసే ప్రేక్షకుడికి నచ్చదు. ఎందుకంటే ప్రీ క్లైమాక్స్‌ వరకు హీరో, విలన్‌ క్యారెక్టర్స్‌ మొత్తం తర్వాత నీరుగారిపోయాయి. హీరో క్యారెక్టర్‌ను దర్శకుడు డిజైన్‌ చేసుకున్న తీరులో ముగింపు ఇచ్చినా, ఇంతకు ముందు చెప్పినట్లు అభిమానులకు, కామన్‌ ఆడియెన్‌ ఊహించినంత లేకపోవడం సినిమాకు మైనస్‌ గా మారింది.

యాక్షన్ సన్నివేశాలను బాగానే రాసుకున్నాడు కానీ , మిగతా కథనే సరిగా రాసుకోలేకపోయాడు వంశీ. ముఖ్యం గా ఫస్ట్ హాఫ్ సాగినట్లు , సెకండ్ హాఫ్ సాగితే సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండేది. అల్లు అర్జున్ తన పాత్ర కు 100 % న్యాయం చేసాడు కానీ వంశీ తన పనితనాన్ని పెద్దగా చూపించలేకపోయారు. ఓవరాల్ గా సూర్య కు హైప్ ఎక్కువ – మేటర్ తక్కువ.

Tagged: , , , , ,