రివ్యూ : నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్

టైటిల్ : ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్‘ (2016)

స్టార్ కాస్ట్ : హెబ్బా పటేల్, రావు రమేష్ , తేజస్విని , అశ్విన్, నోయెల్, పార్వతీశం తదితరులు..

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : భాస్కర్ బండి
నిర్మాతలు: బెక్కం వేణు గోపాల్
మ్యూజిక్ : శేఖర్ చంద్ర
విడుదల తేది : డిసెంబరు 16, 2016
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్

NNB-Telugu-review

కుమారి 21 ఎఫ్ తో యూత్ కు బాగా దగ్గరైన హెబ్బా పటేల్ , మొదటి సినిమాతోనే గోల్డెన్ లెగ్ అనే ముద్ర వేసుకున్న ఈ భామ , ఈడో రకం వాడో రకం , ఎక్కడికి పోతావు చిన్నవాడా ఇలా వరుస హిట్స్ చిత్రాలతో బాగా క్రేజ్ తెచ్చుకుంది..ఇక తాజాగా నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భాస్క‌ర్ బండి ద‌ర్శ‌క‌త్వం వహించగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు ఈ సినిమాను రిలీజ్ చేయడం తో సినిమా ఫై మరింత ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఈ మూవీ లో నాన్న ఎవరు..బాయ్ ఫ్రెండ్స్ ఎవరనేది తెలుసుకుందాం..

కథ :

ఇంట్లో పెళ్లి వద్దని తనకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటానని హైదరాబాద్ కు వస్తుంది పద్మావతి (హెబ్బా పటేల్)..ఆలా సిటీ కి వచ్చిన పద్మావతి , ముగ్గురు అబ్బాయిలను సెలెక్ట్ చేసుకుంటుంది వారే గోకుల్ (నోయెల్), నాని (అశ్విన్), నమో (పార్వతీశం) ..ఇలా ఒకరికి తెలియకుండా మరొకర్ని ప్రేమిస్తుంది..వారు కూడా పద్మావతి అంటే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం అనే రీతిలో ప్రేమిస్తారు..

చివరికి వచ్చే సరికి ఆ ముగ్గురిలో ఎవర్ని పెళ్లి చేసుకోవాలో తెలియక అయోమయం లో పడిపోంది.. ఆ టైం లో పద్మావతిని ప్రాణంగా చూసుకునే ఆమె తండ్రి (రావు రమేష్) కూతురి పెళ్లి ఫై ఓ నిర్ణయం తీసుకుంటాడు.. ఆ నిర్ణయం ఏంటి..? చివరకు పద్మావతి ఎవర్ని పెళ్లి చేసుకుంటుంది .? అనేది మీరు తెరపై చూడాల్సిందే..

Also Read :మరో ఆఫర్ దక్కించుకున్న హెబ్బా పటేల్

ప్లస్ :

* హెబ్బా పటేల్

* హెబ్బా పటేల్ – రావు రమేష్ సెంటిమెంట్ సీన్స్

* కామెడీ

మైనస్ :

* ఫస్ట్ హాఫ్

* కథనం

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

ముందుగా హెబ్బా పటేల్ యాక్టింగ్ గురించి చెప్పుకోవాలి..ఈమెలో కేవలం గ్లామర్ యాంగిల్ మాత్రమే ఉందని అందరూ అంటుంటారు..కానీ ఈమెలో సెంటిమెంట్ కూడా బాగా పండించగలదని నిరూపించింది..తండ్రీ కూతుళ్ల మ‌ధ్య వచ్చే సన్నివేశాల్లో హెబ్బా బాగా నటించింది. ముగ్గురి బాయ్ ఫ్రెండ్స్ ప్రేమ మధ్య నలిగి పోయే లవర్ గా ఆకట్టుకుంది..ఇక రావు రమేష్ ఎప్పటిలాగే తన సెంటిమెంట్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు..

ఇక హీరోలైన అశ్విన్ బాబు, పార్వ‌తీశం, నోయ‌ల్ సేన్ కామెడీ , డాన్సులతో అదరగొట్టారు. కృష్ణ‌భ‌గ‌వాన్‌, స‌న‌, తోట‌ప‌ల్లి మ‌ధు, ధ‌న్ రాజ్‌, జ‌బ‌ర్ద‌స్త్ ష‌క‌ల‌క శంక‌ర్‌, చమ్మ‌క్ చంద్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

సాంకేతిక విభాగం :

చోటా.కె.నాయుడు కెమెరా పనితనం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు..సినిమాని చాల కలర్ ఫుల్ గా చూపించి సక్సెస్ అయ్యాడు. శేఖ‌ర్ చంద్ర‌ సంగీతం టైటిల్ సాంగ్ బాగా ఆకట్టుకుంది..మిగతా మూడు , నాల్గు పాటలు బాగున్నాయి. నేపధ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాల బోర్ కొట్టించింది..అలాగే సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సన్నివేశాలు వెస్ట్ అనిపిస్తాయి.

ఇక కథ విషయానికి వస్తే మనకు తెలిసిన కథనే బి.సాయికృష్ణ‌ మరోసారి అందించాడు..కాకపోతే కాస్త ఫాదర్ సెంటిమెంట్ ఎక్కువగా రాసుకున్నాడు. దర్శకుడు భాస్కర్ బండి ఎక్కడా విపరీత ధోరణికి పోకుండా అనుకున్న హద్దుల్లోనే సినిమాని తెరకెక్కించాడు.

చివరిగా :

ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కిన ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ ‘ తెలిసిన కథ అయినప్పటికి కాస్త సెంటిమెంట్ , కామెడీ , హీరోస్ – హీరోయిన్ ని ప్రేమలో దింపడానికి చేసే పనులు ఇలా అన్ని ప్రేక్షకుడికి వినోదాన్ని పంచుతాయి. తండ్రీ కూతుళ్ల మ‌ధ్య స్వ‌చ్ఛమైన అనుబంధాన్ని చాటి చెప్పే చిత్రంగా ఆకట్టుకుంటుంది.

Tagged: , ,