రివ్యూ : నేనోరకం – ఇదో కిడ్నాప్ రకం.

టైటిల్ : ‘నేనోరకం’ (2017)
స్టార్ కాస్ట్ : సాయిరాం శంకర్ , రేష్మిమీనన్, శరత్ కుమార్ తదితరులు.
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సుదర్శన్ సలేంద్ర
నిర్మాతలు: శ్రీకాంత్ రెడ్డి
మ్యూజిక్ : మహిత్ నారాయణ్
విడుదల తేది : మార్చి 17 , 2017
తెలుగు మిర్చి రేటింగ్ :3/5

రివ్యూ : నేనోరకం – ఇదో కిడ్నాప్ రకం.

Nenorakam-telugu-review

పూరి దర్శకత్వం లో ‘143’ చిత్రం తో హీరో గా పరిచయం అయిన పూరి తమ్ముడు సాయి రామ్ శంకర్ , హీరోగా మాత్రం రాణించలేకపోతున్నాడు. ఏడాదికో ఓ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కానీ హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. తాజాగా నేనోరకం మూవీ తో ఈరోజు థియేటర్స్ లోకి వచ్చాడు.

సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ లో శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో కనిపించడం విశేషం. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ మూవీ , ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..సాయిరాం ఈ మూవీతోనైనా హిట్ కొట్టాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

గౌతమ్ (సాయిరాం శంకర్ ) తల్లిదండ్రులెవరో తెలియకుండా పెరిగిన ఓ అనాధ..స్వేచ్చ‌(రేష్మీమీన‌న్‌)ను చూసిన మొదటి చూపులోనే ప్రేమించడం మొదలుపెడతాడు. ఆమె ప్రేమ పొందడం కోసం ఇష్టం వచ్చినట్లు అబ‌ద్దాల‌ాడుతూ , ఆమె ప్రేమను పొందుతాడు. ఓ రోజు స్వేచ్చ త‌న ప్రేమ‌ను చెప్ప‌డానికి గౌత‌మ్ ద‌గ్గ‌ర‌కు వస్తున్న టైం లో ఆమెను కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప‌ర్(శ‌ర‌త్‌కుమార్‌) గౌత‌మ్‌కు ఫోన్ చేసి కొన్ని తాను చెప్పినట్లు చేయకపోతే స్వేచ్చ‌ను చంపేస్తాన‌ని బెదిరిస్తాడు. దాంతో గౌతమ్ , కిడ్నాప‌ర్ చెప్పినదంతా చేస్తూ వ‌స్తాడు. చివ‌ర‌కు ఓ వ్య‌క్తిని చంప‌మ‌ని చెపుతాడు..మరి కిడ్నాప‌ర్ చెప్పినట్లు అతడిని చంపుతాడా..? అసలు కిడ్నాప‌ర్ స్వేచ్చ‌నే ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? స్వేచ్ఛ ఆ కిడ్నాప‌ర్ చేతులోనుండి ఎలా బయటపడుతుంది..? అనేది మీరు తెరఫై చూడాల్సిందే.

ప్లస్ :

* సాయిరాం శంకర్ యాక్టింగ్

* శరత్ కుమార్ రోల్

* సెకండ్ హాఫ్

మైనస్ :

* ఫస్ట్ హాఫ్

* కామెడీ

* హీరో- హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* సాయి రామ్ శంక‌ర్ ఎప్పటిలాగే మంచి ఎన‌ర్జితో నటించాడు. ఫ‌స్టాఫ్ అంతా ల‌వ‌ర్‌బోయ్‌గా, ప్రేమ కోసం అమ్మాయి వెంట‌ప‌డే ప్రేమికుడుగా మెప్పించిన సాయి, సెకండాఫ్‌లో త‌న ల‌వర్ కోసం ఏమైనా చేయ‌డానికి సిద్ధ‌ప‌డే యువ‌కుడుగా మంచి న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. సాంగ్స్ , ఫైట్స్ లలో కూడా తన మార్క్ చూపించాడు.

* రేష్మీమీన‌న్ హాట్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. తన రోల్ కు న్యాయం చేసింది.

* శరత్ కుమార్ రోల్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది..మొదట్లో కిడ్నాప‌ర్ గా కనిపించేసరికి అందరికి విలన్ ఇతడే అనిపిస్తుంది. కాకపోతే చివర్లో ఓ మంచి పనికోసం హీరోయిన్ ను కిడ్నాప్ చేయడం అందరికి ఆశ్చర్య పరిచింది.

* ఎం.ఎస్‌.నారాయ‌ణ చనిపోయే ముందు చేసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి..తననటన గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. ఎం.ఎస్‌.నారాయ‌ణ‌, వైవా హ‌ర్ష కామెడి పర్వాలేధు. నెగ‌టివ్ ట‌చ్ ఉన్న పోలీస్ ఆఫీస‌ర్‌గా ఆదిత్య మీన‌న్ యాక్టింగ్ ఒకే.

* కాశీ విశ్వనాద్, పృద్వీ, జబర్దస్త్ టీమ్ మొదలగు వారి నటన ఒకే.

సాంకేతిక విభాగం :

ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ మ‌హిత్ నారాయ‌ణ గురించి చెప్పుకోవాలి..అతడి సాంగ్స్ పర్వాలేదు అనిపించినప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. సిద్ధార్థ్ రామ‌స్వామి సినిమాటోగ్ర‌ఫీ బావుంది. డైరెక్టర్ సుద‌ర్శ‌న్ స‌లేంద్ర ఎంచుకున్న కథ , ప్రస్తుతం ప్రేమ పేరుతో మోసపోతున్న అమ్మాయిలు, వారి తలిదండ్రులు పడే బాధను పాయింట్ చేసి ఈ మూవీని తెరకెక్కించాడు. కథ పరంగా ఒకే అనిపించినా , ఇలాంటి కథలు చాలానే రావడం , కథలో కామెడీ లేకపోవడం అనేది కాస్త ప్రేక్షకుడికి బోర్ కొట్టవచ్చు. ప్రొడ్యూసర్ శ్రీకాంత్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా :

సాయి రామ్ నటించిన గత చిత్రాలతో పోలిస్తే ఈ మూవీ చాల హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు..కథ కొత్తది కాకపోయినా సెకండ్ హాఫ్ అంత ఎంతో ఆసక్తిగా తెరకెక్కించి ప్రేక్షకులకు మంచి థ్రిల్ ను తీసుకరావడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ ఫై కాస్త శ్రద్ద పెడితే ఇంకాస్త బాగుండేది..శరత్ కుమార్ రోల్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది..ఓవరాల్ గా నేనోరకం – ఇదో కిడ్నాప్ రకం.

Tagged: , , , , , , , , ,