రివ్యూ : నేను లోకల్ – కామెడీ ప్రేమ కథ..

టైటిల్ : నేను లోకల్ (2017)
స్టార్ కాస్ట్ : నాని, కీర్తి సురేశ్, నవీన్ చంద్ర, సచిన్ ఖేడేకర్, పోసాని కృష్ణమురళి తదితరులు.
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : త్రినాథరావు నక్కిన
నిర్మాతలు: దిల్ రాజు
మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్
విడుదల తేది : ఫిబ్రవరి 3, 2017
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

రివ్యూ : నేను లోకల్ – కామెడీ ప్రేమ కథ..

Nenu-local-telugu-review

`ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం`, `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`, `కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌`, `జెంటిల్ మ‌న్‌`, మ‌జ్ను`..వ‌రుస ఐదు చిత్రాల స‌క్సెస్‌తో ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో “సినిమా చూపిస్తా మామా” చిత్రానికి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం `నేను లోక‌ల్‌`.” ఆటిట్యూడ్ ఐస్ ఎవిరీథింగ్‌…క్యాప్ష‌న్‌..అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వరుస హిట్స్ కొడుతున్న నాని లోకల్ తో ఎలాంటి హిట్ కొట్టాడో..అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..

కథ :

బాబు (నాని) క‌ష్ట‌ప‌డి కాపీ కొట్టి ఇంజ‌నీరింగ్ పాస్ అవుతాడు. కీర్తి (కీర్తిసురేష్‌) ను చూసిన తొలిచూపులోనే ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు..కానీ కీర్తి మాత్రం బాబు ప్రేమ‌ను లైట్ తీసుకుంటుంది. కీర్తి తండ్రి లెక్చ‌ర‌ర్‌ కావడం తో కీర్తి ని పెళ్లి చేసుకునే వాడు డీసెంట్‌గా ఉండాలని అనుకుంటాడు. ఈ లోపు బాబు , కీర్తి ని ప్రేమలో పడేస్తాడు. కానీ కీర్తి తండ్రి ఆమెకు సిద్ధార్థ్(న‌వీన్‌చంద్ర‌)తో సంబంధం కుదురుస్తాడు. సిద్ధార్థ్ ..కీర్తిని ప్రేమించి ఆమె కోసం పోలీస్‌గా ఉద్యోగం సంపాదిస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది..? కీర్తి – బాబు ల ప్రేమ వ్యవహారం కీర్తి తండ్రికి ఎలా తెలుస్తుంది..? చివరకు కీర్తి ఎవర్ని పెళ్లి చేసుకుంటుంది..? అనేవి మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ :

* నాని యాక్టింగ్

* నాని – కీర్తి సురేష్ ల లవ్ ట్రాక్

* కామెడీ

* మ్యూజిక్

మైనస్ :

* పాత కథే

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఎలాంటి రోల్ లోనైనా తన నటన తో ప్రేక్షకులను కట్టిపడేసే టాలెంట్ ఉన్న నటుడు. ఇందులో కూడా కాలేజీ స్టూడెంట్ గా మంచి ఎన‌ర్జీ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యం గా కీర్తి ని ఆట పట్టించే సన్నివేశాల్లో కానీ ఆమెతో ప్రేమ సన్నివేశాల్లో కానీ నాని అదరగొట్టాడు..ఇక డాన్స్ లలో కూడా చించేసాడు..ఏ మూవీ లో చూడని నాని డాన్స్ ఇందులో చూస్తారు.

కీర్తి సురేష్..నేను శైలజ చిత్రం తోనే తన యాక్టింగ్ లెవల్ ఏంటో చూపించి ఆకట్టుకుంది..క్యూట్ క్యూట్ లుక్స్ తోనే కాక చీర కట్టు లో హాట్ హాట్ గా కనిపించి యూత్ ను కట్టిపడేసింది. అంతే కాదు ఈ మూవీ లో మరో నటుడు నవీన్ చంద్ర సైతం నెగిటివ్ రోల్ లో మెప్పించాడు. కీర్తి తండ్రిగా సచిన్ ఖేడేకర్ , నాని తండ్రిగా పోసాని కృష్ణమురళి వారి పరిధిలో బాగా నటించారు.

సాంకేతిక విభాగం :

ముందుగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి చెప్పాలి..దేవి మ్యూజిక్ అంటేనే అందులో ఓ ఊపు ఉంటుంది..చిన్న, పెద్ద అని కాకుండా తన రాక్ మ్యూజిక్ తో సినిమాను సగం హిట్ చేసే సత్తా కలవాడు. ఇక ఈ మూవీ కూడా తనదయిన స్టయిల్ లో బాణీలు అందించి సినిమాకు ప్రాణం పోసాడు..ఈ సాంగ్ , ఆ సాంగ్ అని కాకుండా అన్ని సాంగ్స్ అదరగొట్టాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు.

నిజార్ షఫీ సినిమాటోగ్రఫి సినిమాకు మరింత అందాన్ని తెచ్చుపెట్టింది. ప్రసన్న కుమార్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ‘‘నేను నీ పెళ్ళి చేసిన త‌ర్వాత నిన్ను సాగ‌నంపేట‌ప్పుడు క‌న్నీళ్ళు పెట్టుకోవాలే కానీ..పెళ్ళి చేయ‌డానికి క‌న్నీళ్ళు పెట్టుకోకూడ‌దు’’ అంటూ వచ్చే ఎమోషనల్ సీన్స్ కు మాటలు కంటతడి పెట్టించాయి. స్టోరీ పాతదే అయినప్పటికీ దానికి కాస్త సెంటిమెంట్స్ , కామెడీ జోడించి డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన సక్సెస్ అయ్యాడు. ఇక నిర్మాణ విలువల గురించి చెప్పనవసరం లేదు..కథ కు తగ్గ ఖర్చు పెట్టి , దానికి రెట్టింపు లాభాలు తెచ్చుకోవడం లో దిల్ రాజు ముందుంటాడు. ఇక ఈ మూవీ లో కూడా అదే విధంగా చేసాడు.

చివరిగా :

‘నేను లోకల్ ‘ అని ఇడియట్ మూవీ లో రవితేజ చెప్పసాడు..కాకపోతే నాని మాత్రం లోకల్ కు కాస్త కామెడీ , సెంటిమెంట్ జోడించి యూత్ కు దగ్గరయ్యాడు..యూత్ కు బాగా నచ్చే సన్నివేశాలు నిండుగా ఉండడం తో సినిమా బాగా నచ్చుతుంది..ఇటీవల కాలం లో థియేటర్స్ కు వెళ్లి యూతే సినిమాలు చూస్తున్నారు కాబట్టి ..డైరెక్టర్ ఎక్కువగా వారినే ఫోకస్ చేసినట్లుంది..మొత్తానికి నేను లోకల్ అంటూ యూత్ ను బాగా ఆకట్టుకున్నాడు..

Tagged: , ,