రివ్యూ : ఒక్కడు మిగిలాడు – సీరియస్ గా సాగే ఒక్కడు

టైటిల్ : ‘ ఒక్కడు మిగిలాడు ‘ (2017)
స్టార్ కాస్ట్ :మంచు మ‌నోజ్‌, అనీషా అంబ్రోస్‌, అజ‌య్ ఆండ్రూస్‌ తదితరులు…
దర్శకత్వం : అజ‌య్ అండ్రూస్‌
నిర్మాతలు: ఎస్‌.ఎన్‌.రెడ్డి, ల‌క్ష్మీకాంత్‌
మ్యూజిక్ :
విడుదల తేది : నవంబర్ 10, 2017
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

రివ్యూ : ఒక్కడు మిగిలాడు – సీరియస్ గా సాగే ఒక్కడు

అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా ప‌ద్మ‌జ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యాన‌ర్‌ఫై తెరకెక్కిన చిత్రం `ఒక్క‌డు మిగిలాడు`. ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు మనోజ్. గత కొంతలంగా సరైన హిట్ లేని మనోజ్..ఈ సారి ఎల్‌.టి.టి.ఈ. నేత ప్రభాకరన్‌ నమ్ముకొని ఈ చిత్రం లో నటించాడు. మరి మనోజ్ కు ఈ చిత్రం ఎలాంటి హిట్ ఇచ్చిందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

శరణార్థి & స్టూడెంట్ అయినా సూర్య (మంచు మనోజ్ ) స్టూడెంట్స్ కు లీడర్ గా వారి సమస్యలను తీరుస్తుంటాడు..ఈ నేపథ్యం లో సూర్య ఉండే ఏరియాలో ముగ్గురు యువతులు ఆత్మ హత్య చేసుకుంటారు. అయితే వారి ఆత్మహత్య వెనుక మినిస్టర్‌ ఇద్దరు కొడుకుల హస్తం ఉందని తెలుసుకుంటాడు. ఎలాగైనా వారికీ కఠిన శిక్ష పడాలని పోరాటం సాగిస్తాడు. ఈ నేపథ్యం లో ఆ మినిష్టర్ సూర్య ఫై గంజాయి స్మగ్లర్‌ ముద్ర వేసి అరెస్ట్ చేయిస్తాడు. ఆ తర్వాత జైలు నుండి సూర్య తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? సూర్యకీ, శ్రీలంకలో ఉన్న పీటర్‌కు సంబంధం ఏంటి ..? సూర్య ఆ మినిస్టర్‌ కొడుకుల ఫై ఎలా పాగా తీర్చుకుంటాడు అనేది మిగతా కథ.

Also Read :   రివ్యూ : రాజుగారి గది 2 - ఫ్యామిలీ తో వెళ్లొచ్చు..

ప్లస్ :

* మనోజ్ యాక్టింగ్

* పోరాట సన్నివేశాలు

మైనస్ :

* స్లో నేరేషన్

* సినిమా అంత సీరియస్ గా సాగడం

* కామెడీ లేకపోవడం

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ముందుగా మనోజ్ నటన గురించి చెప్పాలి..ఎలాంటి పాత్రైనా దానికి ప్రాణం పెట్టి నటించడం లో మనోజ్ ముందుంటాడు. ఈ మూవీ లో కూడా అలంటి పాత్రే చేసాడు..స్టూడెంట్ పాత్ర లో, పీటర్‌ పాత్రలో సరికొత్త నటనను కనపరిచి ఆకట్టుకున్నాడు. పీటర్ పాత్ర కోసం 20 కిలోలు పెరిగాడు. సూర్య పాత్ర కోసం 10 కిలోలు తగ్గి చాల కష్టపడ్డాడు.

Also Read :   రివ్యూ : c/o సూర్య - థ్రిల్లర్‌ స్టోరీ

* అలాగే దర్శకుడు అజయ్‌ ఆండ్రూస్‌ కూడా ఓ కీలక రోల్ లో కనిపించినప్పటికీ , అతడి ప్లేస్ లో వేరే అతడిని పెడితే బాగుండు అనిపించింది.

* జర్నలిస్టు పాత్రలో అనీషా ఆంబ్రోస్‌ తన పరిధి మేరకు బాగానే నటించింది.

* మినిష్ట‌ర్‌గా మిలింద్ గునాజీ, ప్రొఫెస‌ర్‌గా న‌టించిన సూర్య. సీఎం పాత్ర‌లో ముర‌ళీ మోహ‌న్‌, హెల్త్ మినిష్ట‌ర్ పాత్ర‌లో సుహాసిని ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం :

* వి.కోదండ రామరాజు సినిమా ఫోటోగ్రఫి పర్వాలేదు అనిపించింది.

* కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో చాల బోరింగ్ కొట్టింది. ముఖ్యం 40 నిమిషాల పాటు పడవలో సాగే ఎపిసోడ్ అయితే ఎప్పుడెప్పుడు బయటకు పోదామనిపిస్తుంది.

* గోపీమోహ‌న్‌ స్క్రీన్ ప్లే ఓకే.

* ఇక డైరెక్టర్ అజ‌య్ అండ్రూస్‌ 2017లో జరిగిన కథకు పాతికేళ్ల క్రితం శ్రీలంకలో జరిగిన ఉద్యమానికి ముడి పెట్టి సినిమాను తెరకెక్కించారు. శ్రీలంకలోని శరణార్థుల కష్టాలు, వారి కన్నీటి గాథ, పౌరసత్వం కోసం వారు చేసే ప్రయత్నాలు తదితర అంశాలను దర్శకుడు చక్కగా చూపించారు. కాకపోతే కాస్త కామెడీ ఉంటె బాగుండు…సినిమా అంత సీరియస్ గా సాగడం , 40 నిమిషాలపాటు పడవ ప్రయాణానికి సంబంధించిన సన్నివేశాలు ఉండడం కాస్త ప్రేక్షకులను బోర్ కొట్టించింది.

Also Read :   రివ్యూ : నెక్స్ట్ నువ్వే..భయపెట్టలేకపోయిన నువ్వే..

చివరిగా :

శరణార్థుల చరిత్ర , ఎల్‌టీటీఈ అంశంపై అవగాహన ఉన్నవాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది. ఇక ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికీ ఏ మాత్రం ఈ సినిమా నచ్చదు. దేశ విభజన సమయంలో తమిళనాడు నుంచి శ్రీలంకకు వలసపోయిన శరణార్థులు తమ జాతి మనుగడ కోసం ఎలా పోరాటం చేశారనేది డైరెక్టర్ ఈ మూవీ ద్వారా చూపించాడు. శ్రీలంక‌లోని త‌మిళుల కోసం పోరాడే నాయ‌కుడు పీట‌ర్‌గా, విద్యార్థి నాయ‌కుడు సూర్య‌గా రెండు పాత్ర‌ల‌ను మంచు మ‌నోజ్ చ‌క్క‌గా చేశాడు. పీట‌ర్ పాత్ర హై ఇన్‌టెన్స‌న‌ల్, ఎమోష‌న‌ల్‌గాసాగితే, సూర్య పాత్ర సెటిల్డ్‌గా సాగుతుంది. రెండు పాత్ర‌ల్లో మ‌నోజ్ చ‌క్క‌టి వేరియేష‌న్‌ను చూపించాడు. కాకపోతే సెకండ్ హాఫ్ లోనే డైరెక్టర్ ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండు. ముఖ్యం 40 నిమిషాలపాటు పడవ ప్రయాణానికి సంబంధించిన సన్నివేశాలే తగ్గిస్తే బాగుండేది. ఓవరాల్ గా సీరియస్ గా సాగే ఒక్కడు మిగిలాడు.

loading...
Tagged: , , ,