రివ్యూ : రాజుగారి గది 2 – ఫ్యామిలీ తో వెళ్లొచ్చు..

టైటిల్ : ‘ రాజు గారి గది 2 ‘ (2017)
స్టార్ కాస్ట్ : నాగార్జున, సమంత , సీరత్ కపూర్ తదితరులు…
దర్శకత్వం : ఓంకార్
నిర్మాతలు: పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్
మ్యూజిక్ : థమన్
విడుదల తేది : అక్టోబర్ 13, 2017
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

రివ్యూ : రాజుగారి గది 2 – ఫ్యామిలీ తో వెళ్లొచ్చు..

ఆట ఫేమ్ ఓంకార్ తెరకెక్కించిన “రాజుగారి గది”కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం “రాజుగారి గది-2” . కింగ్ నాగార్జున , సమంత , సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ కామెడీ నేపథ్యం లో ఈ మూవీ తెరకెక్కడం , నాగార్జున మెంటలిస్ట్ గా, సమంత ఆత్మ గా కనిపించడం తో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సినీ జనాల్లో నెలకొని ఉంది. మరి వారి ఆసక్తి ని రాజుగారు ఎలా తీర్చారనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ప్రాణ స్నేహితులైన అశ్విన్‌(అశ్విన్‌), కిశోర్‌(వెన్నెల కిశోర్‌), ప్రవీణ్‌(ప్రవీణ్‌) రాజుగారి రిసార్ట్‌ను కొనుగోలు చేసి అందులోకి వెళ్ళతారు..ఇక ఆలా వెళ్లిన వారికీ రాత్రి కాగానే ఆ రిసార్ట్‌ లో కొన్ని భయంకర శబ్దాలు వినిపించడం , ఓ నీడ కనిపించడం మొదలు పెడుతుంది..ఏంటి అని ఆరా తీయగా వారికీ అందులో దెయ్యం ఆత్మ గా తిరుగుతుందనే నిజం తెలుస్తుంది. దీంతో ఎలాగైనా ఆ దెయ్యాన్ని రిసార్ట్‌ నుండి బయటకు పంపించాలని చర్చి ఫాదర్‌ (నరేశ్‌)ని సంప్రదిస్తారు. ఫాదర్‌ మాత్రం ఇలాంటి వాటికీ రుద్ర (నాగార్జున ) అయితే కరెక్ట్ అని అతడిని పిలిపిస్తాడు. కళ్లలో చూస్తూ మనసులో ఏముందో చెప్పగల సమర్థుడు రుద్ర. పోలీసులు సాల్వ్ చేయ‌లేని కేసుల్లో వారికి స‌హాయ‌ప‌డుతుంటాడు.

Also Read :   రివ్యూ : జై లవకుశ - అభిమానులకు పండగే..

చ‌ర్చి ఫాద‌ర్ చెప్పిన విష‌యం విన్న రుద్ర‌.. రిసార్ట్ వెళ్లి అక్క‌డ ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని ఆత్మ ఉంద‌ని నిర్ధారించుకుంటాడు. అదే సమయం లో అక్కడే ఉన్న సుహానిసా(శీర‌త్‌క‌పూర్‌) చూసి అనుమానిస్తాడు. కానీ ఆ తర్వాత ఆమెకాదని నిర్దారించుకుంటాడు. అసలు ఆత్మ అమృత అని తెలుసుకుంటాడు. ఇంతకు ఆ అమృత ఎవరు..? ఆ రిసార్ట్‌ లో ఆమె ఎందుకు ఉంది..? అసలు ఆమె ఎలా చనిపోయింది..? చివరకు ఆమె రిసార్ట్‌ నుండి బయటకు వెళుతుందా.. లేదా..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ :

* సెకండ్ హాఫ్

* సమంత – నాగార్జున యాక్టింగ్

* సీరత్ కపూర్ గ్లామర్

* సినిమాటోగ్ర‌ఫీ

* బ‌ల‌మైన ఎమోష‌న్స్‌

మైనస్ :

* ఫస్ట్ హాఫ్

* అనుకున్నంత కామెడీ లేకపోవడం

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* అమృత రోల్ లో సమంత యాక్టింగ్ అదిరిపోయింది..ఫస్ట్ హాఫ్ అంత ఆత్మ గా భయపెట్టిన సామ్..సెకండ్ హాఫ్ లో లా చదువుకున్న అమ్మాయిగా చక్కగా నటించింది. ముఖ్యం గా నాగ్ – సామ్ ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరు కూడా బాగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొదటిసారి సమంత ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించి అభిమానులకు కొత్తదనం చూపించింది.

Also Read :   రివ్యూ : అర్జున్ రెడ్డి - యూత్ మూవీ

* మోడ్రన్‌ సెయింట్‌ రుద్ర పాత్రలో నాగార్జున అదరగొట్టాడు. హీరోయిజ‌మ్‌ను బేస్ చేసుకుని క‌థ‌ను న‌డ‌ప‌కుండా, క‌థానుగుణంగా క్యారెక్ట‌ర్‌లో ఇమిడిపోయారు. క్లైమాక్స్‌లో నాగార్జున‌, స‌మంత‌ల మ‌ధ్య స‌న్నివేశాలు ఎమోష‌న‌ల్‌గా ఉన్నాయి.ఆడ‌పిల్ల‌ల గొప్ప‌తం గురించి చెప్ప‌డ‌మే కాక‌, స‌మాజంలో చెడు ఎదురైన‌ప్పుడు కూడా ఆడ‌పిల్ల‌లు ధైర్యంగా ఉండాల‌ని చెప్పే సంద‌ర్భాల్లో నాగ్ న‌ట‌న ఆకట్టుకుంది.

* స‌మంత తండ్రి పాత్ర‌లో రావు ర‌మేష్‌ చ‌క్క‌గా న‌టించారు. ఇక అభిన‌య, నందు, వెన్నెల‌కిషోర్‌, అశ్విన్‌, ప్ర‌వీణ్‌లు పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు న్యాయం చేశారు.

* సీరత్‌ కపూర్ అందాల ఆరబోత శ్రుతి మించినా, ఆమె పాత్ర‌కీ ప్రాధాన్యం ఉంది. ఈమె అందాలకు యూత్ ఫిదా కావాల్సిందే.

సాంకేతిక విభాగం :

* తమన్ అందించిన మ్యూజిక్ పర్వాలేదు అనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆత్మ‌ను చూపించే సంద‌ర్భంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందర్నీ భయపెట్టేంది.

* ఆర్‌.దివాక‌ర‌న్‌ సినిమా ఫోటోగ్రఫి సినిమా కు ప్రాణం పోసింది. నటి నటులను మాత్రమే కాక మిగతా సన్నివేశాలను కూడా చాల చక్కగా చూపించి సక్సెస్ అయ్యాడు.

* అబ్బూరి ర‌వి మాటలు ఫస్ట్ హాఫ్ లోకన్నా సెకండ్ హాఫ్ లో బాగా ఆకట్టుకున్నాయి. నాగార్జున.. సమంత మధ్య వచ్చే చివరి 20 నిమిషాల సన్నివేశాల్లో వచ్చే మాటలు అందర్నీ కట్టిపడేశాయి.

Also Read :   రివ్యూ : వివేకం - యాక్షన్ ఎంటర్టైనర్..

* ప‌్ర‌సాద్ వి.పొట్లూరి నిర్మాణ విలువల గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమా బాగా రావడం కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకడుగు వెయ్యని నిర్మాత.. ఈ మూవీ కోసం కూడా అలాగే ఖర్చు పెట్టాడు. ఆయన పెట్టిన ప్రతి రూపాయి తెర ఫై కనిపించింది.

* ఇక డైరెక్టర్ ఓంకార్ విషయానికి వస్తే..హర్రర్ సినిమాలంటే కేవలం భయపెట్టడం మాత్రమే కాదు నవ్వించడం కూడా చేయవచ్చని రాజు గారి గది చిత్రం తో నిరూపించాడు. ఈ సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వచ్చిన రాజు గారి గది 2 కూడా ఆ కోవలోనేది. కాకపోతే ఈసారి ఓ మంచి సందేశంతో తీర్చి దిద్దారు.

చివరిగా :

రాజు గారి గది మాదిరి కామెడీ అంత ఉండకపోయినా..ఓ సందేశం తో కూడిన కథ గా డైరెక్టర్ తీర్చిన విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ అంత ఆత్మ , రిసార్ట్ లో ఉన్న ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది..సెకండ్ హాఫ్ లో అసలైన కథ మొదలు అవుతుంది. అప్పటివరకు చూసిన సినిమా వేరు..సెకండ్ హాఫ్ లో చూసిన సినిమా వేరు అనిపిస్తుంది. అమృత గా సమంత రోల్ , రుద్ర గా నాగార్జున రోల్ అందర్నీ ఆకట్టుకుంటాయి. ఇక సీరత్ గ్లామర్ యూత్ ను పిచ్చెక్కిస్తుంది. ఓవరాల్ గా ఈ గదికి ఫ్యామిలీ తో కలిసి వెళ్ళచ్చు.

loading...
Tagged: , , ,