రివ్యూ : వర్మ మార్క్.. వంగవీటి

టైటిల్: వంగవీటి
నటీనటులు : సందీప్‌కుమార్‌.. కౌటిల్య.. శ్రీతేజ్‌.. వంశీ చాగంటి.. నైనా గంగూలీ తదితరులు
సినిమాటోగ్రఫీ : రాహుల్‌ శ్రీవాత్సవ, కె.దిలీప్‌ వర్మ, సూర్య చౌదరి
సంగీతం: రవిశంకర్‌
ఎడిటింగ్ : సిద్ధార్థ
నిర్మాత: దాసరి కిరణ్‌కుమార్‌
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాంగోపాల్‌ వర్మ
విడుదల తేది: 23-12-2016

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

vangaveeti

బేసిక్‌గా కథల కోసం జుట్లు పీక్కుంటారు దర్శకులు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఇందుకు భిన్నం. పబ్లిక్ డొమైన్ లో వుండే కథలు, సంఘటనలు, వార్తలే ఆయన సినిమాలు. ఆయన సొంతగా కథ అనుకోని సినిమా తీస్తే అదోలా ఉటుందని కానీ సోర్స్‌ మెటీరియల్‌ పట్టుకొని సినిమాలు తీస్తే మాత్రం అద్భుతంగా వస్తుంటాయి కొన్ని సార్లు. ఆయన తీసిన ”రక్త చరిత్ర” మామూలు ఇంపాక్ట్ కలిగించలేదు. అలాగే ’26 నవంబర్‌ ఎటాక్స్‌’ని వర్మ తీసిన విధానం అద్భుతం. ఆ సినిమాని చూస్తున్నప్పుడు బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ఏడ్చేశారు. కొంతమంది తెరలు చింపి ఆ ఉగ్రవాదులను తమ చేతులతో చంపేయాలనే ఉద్వేగ స్థితికి వచ్చేశారంటే.. అది ఖచ్చితంగా వర్మ టేకింగ్ లోని గొప్పదనమే. మొన్న ‘కిల్లింగ్ వీరప్పన్’ లోనూ అదే జరిగింది. వర్మ, వీరప్పన్‌ ఎన్‌కౌంటర్‌ని వర్మ డీల్ చేసిన విధానం చాలా మందికి నచ్చింది. అందులో కొన్ని షాట్లు.. ఇది కదా వర్మ..! అని అనుకునేలా చేశాయి. ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో వున్న మరో నిజ జీవిత కధను పట్టుకున్నారు వర్మ. అదే ‘వంగవీటి’. బెజవాడ చరిత్రలో ఈ పేరు ఓ సంచలనం. వర్మకు కూడా బెజవాడతో అనుభంధం వుంది. నిజానికి వర్మ థాట్ ప్రోసాస్, ఆయన సినిమాలు పరిశీలిస్తే.. ఈ సినిమా ఎప్పుడో తెలియాల్సిసింది. మరి ఎందుకు ఇంతకాలం పట్టిందో గానీ మొత్తనికి ‘వంగవీటి’ సినిమా తీసేశాడు వర్మ. మరి, సంచలనాత్మక ఈ నిజజీవిత కధను వర్మ ఎలా డీల్ చేశాడు ? ఏం చూపించాడు.. ‘కమ్మ’ ‘కాపు’ అని పాడుకున్న వర్మ ఎవరి మనో భావాలపైనైనా దెబ్బకొట్టాడా? ఇలాంటి విషయాలు తెలియాలంటే రివ్యూలోకి ఎంటరైపోవాల్సిందే.

కథ: దాదాపు ప్రచారంలో వున్న కథనే చెప్పాడు వర్మ. అయితే దానికి తనదైన ట్రీట్ మెంట్ ఇచ్చాడు. కొన్ని ఇన్ డెప్త్ విషయాలు జోడించాడు. వర్మ కోణంలో చూపిన ‘వంగవీటి’ కధను చెప్పుకుంటే.. చలసాని వెంకటరత్నం విజయవాడ రౌడీయిజానికి నాంది. ఆయన దగ్గర చేరతాడు వంగవీటి రాధా (సందీప్‌కుమార్‌). అయితే వెంకటరత్నంకు రాధపై అనుమానం వస్తుంది. దీంతో రాధ ఇగో హార్ట్ అవుతుంది. అదే సమయంలో అనుచరులు రెచ్చగొట్టడంతో వెంకటరత్నంని లేపెస్తాడు రాధ. దీంతో విజయవాడ రౌడీయిజం రాధ చేతుల్లోకి వెళుతుంది. అదే సమయంలో గాంధీ, నెహ్రూ సోదరులు రాధాకి దగ్గరవుతారు. కొంతకాలని చలసానివెంకట రత్నం అనుచరుల చేతుల్లో రాధా హత్యకి గురవుతాడు. దాంతో రాధా స్థానంలోకి తమ్ముడు రంగా వస్తాడు. కొంతకాలని గాంధీ, నెహ్రూలతో రంగాకి విభేదాలు వస్తాయి. గాంధీ, నెహ్రూలు సెపరేట్ అడ్డా పెట్టుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో రంగా అనుచరుల చేతిలో గాంధీ హత్యకి గురవుతాడు. గాంధీ హత్యకి తమ్ముడు మురళి ఎలా రివెంజ్ తీర్చుకొన్నాడు? నెహ్రూ ఏం చేశాడు? రంగా హత్య ఎలా జరిగింది?.. ఇలా మిగతా ఎపిసోడ్స్ అన్నీ తెరపై చూడాల్సిందే.

ప్లస్
* వర్మ టేకింగ్
* ఫస్ట్ హాఫ్
* పక్కా కాస్టింగ్
* కధలో ఇంటటెన్సిటీ

మైనస్
* సెకెండ్ హాఫ్ సాగదీత
* కధలో చాలా డీటెయిల్స్ వదిలేయడం
* కైమాక్స్ లో వర్మ తెలివిగా తప్పించుకోవడం

సినిమా ఎలా వుంది?
ముందేచెప్పుకున్నట్లు సరైన సోర్స్‌ మెటీరియల్‌ దొరకాలేగానీ ఆదరగొడుతుంటాడు వర్మ. వంగవీటి సినిమాలోనూ వర్మ మెరుపులు కనిపించాయి. వంగవీటి తర్వాత మళ్ళీ తెలుగు సినిమా చేయనని… ఈ సినిమాని మొదలుపెట్టినప్పుడే ఆసక్తిరేపాడు. ఇదే తన చివరి తెలుగు సినిమా అని, అలాగే ‘కమ్మ’ ‘కాపు’ అని ఎదో హడావిడి చేశారు. అయితే అలాటిందేమీ లేదు. అస్సల్ వివాదం జోలికి వెల్లలేదు వర్మ. పబ్లిక్ డొమైన్ లో వుండే ఓ సంచలనాత్మక కధను డాక్యుమెంట్ చేయాలనుకున్నాడు. అదే చేశాడు. తప్పితే వివాదం జోలికి వెల్లలేదు.

కధ ముందే చెప్పుకున్నాం. తీవ్రమైన ఇంటెన్సిటీ తో కూడిన పాత్రలివి. ఆ ఇంటెన్సిటీ స్క్రీన్ పై తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు వర్మ. వంగవీటి రాధా, వెంకటరత్నం, రంగా, గాంధీ, నెహ్రూ.. ఇలా పాత్రలన్నీ తీవ్రమైన ఇంటెన్సిటీతో వుంటాయి. దాదాపు ఇరవై ఏళ్ళు పాటు జరిగిన సంఘటనలను రెండున్నర గంటల్లో చెప్పాలంటే చాలా కష్టమైన పని. అయితే ఇలాంటి కధలు చెప్పడం వర్మకు ఇష్టం కాబట్టి.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో చక చక నడిపించేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా కధ ముందుకు సాగిపోతుంది. విజయవాడ రౌడీ రాజకీయం వెంకటరత్నం నుంచి ఎలా మొదలైంది? ఆయన నీడలో రాధా ఎలా ఎదిగాడు? వాళ్లిద్దరి హత్యలు ఎలా జరిగాయి? ఏ పరిస్థితుల్లో రాధా తమ్ముడు రంగా లీడర్ అయ్యాడు.. ఇలా ప్రతి విషయాన్ని తనదైన శైలిలో చిత్రీకరించాడు వర్మ.

అయితే సెకండ్ హాఫ్ వచ్చేసరికి వేగం మందగించింది. రంగా పొలిటికల్ ఎంట్రీ తర్వాత ఎమోషన్స్ డల్ అయ్యాయి. వెంకటరత్నం, రాధా, గాంధీ హత్యలు.. ఎపిసోడ్స్ ను తనదైన స్టయిల్ లో చిత్రీకరించిన వర్మ ..సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ తీవ్రతను క్యారీ చేయలేకపోయాడనిపిస్తుంది. రంగా పొలిటికల్ ఎంట్రీ తర్వాత చాలా డెవలాప్ మెంట్స్ జరిగాయి. అయితే వాటిపై పెద్దగా ద్రుష్టిపెట్టలేదు వర్మ. అలాగే ఈ కధ క్లైమాస్ కూడా తనదైన మార్క్ లో ముగించాడు. రంగా మర్డర్ తో సినిమాకి ఎండ్ కార్డ్ పడిపోతుంది. అయితే ఈ మర్డర్ కి గల కారణాలు చెప్పలేదు వర్మ. బహుసా..వాటిని టచ్ చేస్తే మళ్ళీ లేనిపోని వివాదాలు అనుకున్నాడెమో కానీ అక్కడితో సినిమా ముగించేశాడు.

బేసిగ్గా వర్మకు  తెలివితేటలు ఎక్కువ. సినిమాలు తీయడం అంటే పిచ్చి. తీసిన సినిమాపై ఆసక్తిని రేపడం కూడా ఆయనకి బాగా తెలుసు. అందుకే ఈ సినిమా విషయంలో ‘కమ్మ’ ‘కాపు’ అని నానా హంగామా చేశాడు. తప్పితే ఈ సినిమా లో ఎలాంటి వివాదాలు లేవు.

అందరూ విన్న కధ స్క్రీన్ పై చూస్తే ఎలా ఉటుందో అని ఫీలై వంగవీటిని తీశాడు వర్మ. ఇది కంప్లీట్ గా వర్మ సినిమా. ప్రతీ సీన్ లోను ఆయన మార్క్ కనిపిస్తుంది. నటీనటుల ఎంపిక, సినిమాటోగ్రఫీ, రీరికార్డింగ్.. డైలాగ్స్ ఇలా అన్నిట్లో వర్మ కనిపిస్తాడు. ఈ మధ్య కాలంలో వర్మ తీసిన సినిమాల్లో ఇది బెస్ట్ అనే చెప్పాలి. ఈ కధ బ్యాక్ డ్రాప్ తెలియని వారు కూడా సినిమాతో కనెక్ట్ అయ్యే ఛాన్స్ వుంది. ఈ సినిమా కోసం వర్మ బాగానే రిసెర్చ్ చేసినట్లుఅనిపిస్తుంది. ఒక హత్య చేయాడానికి ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ? ఎలాంటి ఆలోచనలతో వుంటారు ? వాళ్ళ స్టేట్ అఫ్ మైండ్ ఎలా ఉటుందన్నదానిపై వర్మ చూపించిన థీసెస్ క్రైమ్ జోనర్ సినిమాలను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. వర్మ అభిమానులైతే మాత్రం సినిమాని పార్టు పార్టులు గా ఎంజాయ్ చేస్తారు. ఇక మామూలు ప్రేక్షకులు విషయాని వస్తే.. ఈ సినిమాని ఎందుకు చూడాలి అనేది వారి ఛాయిస్.

ఈ సినిమాలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పాయింట్ ”రంగా హత్య- దానికి కారణాలు ,కారకులు”. అయితే ఇలాంటి సినిమాలు చేసినప్పుడు అసలు పాయింట్ ను దాటవేస్తుంటాడు వర్మ. రక్తచరిత్రలో కూడా అదే చేశాడు. ”నాకు తెలిసింది ఇంతే .. జడ్జ్ చేయడానికి నేనెవరిని.. ఐయామ్ ఏ ఫిల్మ్ మేకర్” అని చాల తెలివిగా తప్పించుకున్నాడాయన. ఇప్పుడు వంగవిటీకి అదే ఫార్ముల వర్క్ అవుట్ చేశాడు. రంగ హత్య ఎలా, ఎందుకు జరిగింది ? అని చివర్లో వాయిస్ ఓవర్ ఇస్తూ ఓ సెటైర్ తో ముగించేశాడు వర్మ. ఆ సెటైర్ ఏమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tagged: , ,