రెండో రోజు : ఆసీస్ కి భారత్ గట్టి సమాధానం

teamindia
teamindia

రాంచీ టెస్టులో ఆసీస్ కి భారత్ గట్టి సమాధామిస్తోంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. మురళీ విజయ్ 42, పుజారా 10పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. ఓపెనర్ కె ఎల్ రాహుల్ (67; 102 బంతుల్లో9×4) సిరీస్‌లో నాలుగో అర్ధశతకం బాదాడు. కమిన్స్‌ వేసిన 31.2వ బంతిని ఆడబోయి కీపర్‌ మాథ్యూవేడ్‌కు దొరికిపోయాడు. దీంతో.. రాహుల్‌, విజయ్‌ ల 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

అంతకు ముందు 299/4తో తొలి ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఆసీస్ 451 పరుగులకు పరిమితమైంది. స్టీవ్‌ స్మిత్‌ (178 నాటౌట్‌; 361 బంతుల్లో 17×4), మాక్స్‌వెల్‌ (104; 185 బంతుల్లో 9×4, 2×6) ఆసీస్ ని భారీ స్కోర్ దిశగా నడిపించారు. అయితే ఆసీస్ జోరుకి జడేజ 5 వికెట్లు తీసి కళ్లెం వేశాడు. మరోవైపు పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ వైవిధ్యమైన బంతులు విసురుతూ 3 వికెట్లు పడగొట్టాడు.

భుజం నొప్పి కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగలేదు. రహానే కెప్టెన్ బాధ్యతలని నిర్వహించారు. ప్రస్తుతం భారత్ 120/1తో నిలిచింది. ఆసీస్‌ లక్ష్యాన్ని అందుకోవాలంటే భారత్‌ మరో 331 పరుగులు చేయాలి. మూడో రోజంతా టీమిండియా బ్యాటింగ్ చేయకలిగితే.. ఆసీస్ ని సవాల్ చేస్తే లెవల్ కి రావడం ఖాయం.