లంకలో రికార్డుల మోత

భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో భారత ఆటగాళ్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. మ్యాచ్‌లో 17.4 ఓవర్లలోనే భారత జట్టు 100 పరుగులను పూర్తి చేసింది. ధాటిగా ఆడిన ధావన్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం 115 పరుగలతో ఆటని కొనసాగిస్తున్నాడు. భారత్ 188పరుగుల వద్ద తొలి వికెట్ ని కోల్పోయింది. 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 211/1తో ఆటని కొనసాగిస్తోంది.

Also Read :   ప్చ్.. ఓడిపోయాం

ఈ టెస్టులో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనతను అందుకున్నాడు. టెస్టు కెరీర్లో 9వ అర్ధశతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఇది రాహుల్‌కి వరుసగా 7వ అర్ధశతకం కావడం విశేషం. వరుసగా ఏడు అర్ధశతకాలు సాధించిన ఆటగాళ్లలో రాహుల్ ఆరోవాడు. భారత్ నుంచి ఈ ఘనతని రాహుల్ ద్రావిడ్ సాధించారు. ఇదీగాక, గత నాలుగేళ్లల్లో శ్రీలంక గడ్డపై తొలి వికెట్‌కి అజేయంగా 100కు పైగా పరుగులు నమోదు చేసిన రెండో జోడీగా ధావన్‌-రాహుల్‌ నిలిచారు.

Also Read :   భారత్‌, పాక్‌.. లండన్ నైట్స్

మూడు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే భారత్ 2/0తో సిరీస్ ని సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. మూడో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ని ఎంచుకొంది.