అక్షయ్ బాటలో సైనా

saina

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నిజమైన హీరో అనిపించుకొన్నాడు. మార్చి 11న చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 12 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 12 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు అక్షయ్ ఆర్ధిక సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 9 లక్షల రూపాయల చొప్పున (కోటీ ఎనిమిది లక్షల రూపాయల) ఆర్ధిక సాయం ప్రకటించారు.

ఇప్పుడు అక్షయ్ ని స్పూర్తిగా తీసుకొంది బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్. తన 27వ పుట్టినరోజు సందర్భంగా జవాన్ల కోసం రూ. 6లక్షలు ప్రకటించింది. చత్తీస్‌ గఢ్‌ లోని సుక్మా జిల్లాలో నక్సల్స్‌ దాడిలో మరణించిన 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఈ నగదుని అందజేయనుంది. సైనా అందించిన సాయంతో ప్రతి జవాను కుటుంబానికి 50 వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నారు.