సన్‌రైజర్స్ కు గాయాల దెబ్బ

ఐపిఎల్-2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గాయాల దెబ్బ తగిలింది. కీలక దశలో కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కానున్నారు. ఇకపై సన్‌రైజర్స్ జట్టు ఆడనున్న మ్యాచ్‌లకు వెటరన్ భారత పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా దూరం కానున్నాడు. ఫిట్‌నెస్ విషయంలో విఫలమవ్వడమే అందుకు కారణం. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోచ్ టామ్ మూడీ వెల్లడించారు.

మరోవైపు, సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్‌ జట్టులో ఉండటం డౌటుగానే కనిపిస్తోంది. ఈరోజు (మంగళవారం) సాయంత్రం యువీ ఫిట్ నెస్ పరీక్షని ఎదుర్కోనున్నాడు. ఇందులో పాసైతేనే మిగితా మ్యాచ్ లకి యువీ అందుబాటులో ఉంటాడు. సన్‌రైజర్స్ జట్టు 17వ తేదీన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు జట్టుకి దూరమైతే తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి.