ఆసీస్ మైండ్ గేమ్స్ కు భారత్ పంచ్


ఇండియ‌న్ టీమ్‌తో సిరీస్ మొద‌ల‌య్యే ముందు ఆస్ట్రేలియా మీడియా మైండ్ గేమ్స్ మొదలుపెట్టింది. మైండ్ గేమ్స్ పేరుతో దిగ‌జారుడు కామెంట్స్ కు రెడీ అయ్యింది. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌ జరిగే సమయంలోనూ మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆసీస్‌ జర్నలిస్టు ఒకరు కోహ్లీ సేనను కార్మికులతో పోల్చడం వివాదాస్పదమైంది.

స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా గతంలో కోహ్లీ సేన కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ మైదానాన్ని శుభ్రం చేసింది. దీనికి సంబంధించిన ఫొటోని డెన్నిస్‌ ఫ్రీడ్‌మాన్‌ అనే ఆసీస్‌ జర్నలిస్టు తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. దీనికి ‘ప్రపంచ ఎలెవన్‌ మ్యాచ్‌ కోసం కార్మికులు మైదానాన్ని శుభ్రం చేస్తున్నారు’ క్యాప్షన్‌ ఇచ్చాడు.

Also Read :   లంకను గుండు కొట్టేసిన భారత్

కోహ్లీని కార్మికుడితో పోలిస్తే నెటిజన్లు వూరుకుంటారా!.. డెన్నిస్‌కు చురకలంటిస్తూ రీట్వీట్లు పెడుతున్నారు. ఇప్పుడు డెన్నిస్‌-భారత క్రికెట్‌ అభిమానుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. దీనిపై అభిమానులు అదిరిపోయే పంచ్ ఇచ్చారు. ”అవును అత‌నే స్వీప‌రే.. రాబోయే ఆస్ట్రేలియా సిరీస్‌ను కూడా అలాగే స్వీప్ చేస్తాడని” బ్లాస్టింగ్ పంచ్ ఇచ్చారు ఇండియన్ ఫ్యాన్స్

loading...