భువీ లక్కీగర్ల్‌.. టాలీవుడ్ హీరోయిన్ కాదట

భారత బౌలర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు భువనేశ్వర్‌ కుమార్‌ టాలీవుడ్ అల్లుడు కాబోతున్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇటీవల భువి ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌ చేస్తున్న ఫొటో ఒకటి తన ఇన్‌స్టాగ్రాంలో ఉంచి ‘డిన్నర్‌ డేట్‌… పూర్తి చిత్రం త్వరలో’ అని పేర్కొన్నారు. దీంతో.. భువి లక్కీ గర్ల్‌ ఎవరా ? అంటూ ఆరాతీయడం మొదలుపెట్టారు. ఓ యువతితో కలిసి భువి కారులో వెళ్తున్నట్లు కనిపించిన ఫొటోలను అభిమానులు సోషల్‌మీడియాలో ఉంచారు. కారులో భువి పక్కన ఉన్నది మోడల్‌ అనుస్మృతి సర్కార్‌ అని తేల్చేశారు. ఈ ప్రచారంతో అనుస్మృతి ఎక్కడ లేని ప్రచారం దొరికింది.

Also Read :   ఐపీఎల్ సెకన్ యాడ్ రేట్ ఎంతో తెలుసా..?

ఈ న్యూస్ విన్న భువీకి మాత్రం షాక్ కొట్టింది. బాబోయ్.. అనుస్మృతి తన ప్రేయసి కాదు.. ఆ ప్రచారాన్ని ఆపాలని వేడుకొంటున్నాడు. మరీ.. రియల్ ప్రేయసీ ఎవరయ్యా బాబూ.. అంటే.. ? సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా.. అప్పటి వరకు ఓపిక పట్టండని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంతకీ భువీ లక్కీ గర్ల్ ఎవరంటారు.. ???