ధోని రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ

dhoni

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ ధోనీ రికార్డులను దాటేశాడు. టెస్టుల్లో ధోనీ అజేయంగా ఏడు సిరీస్ లలో విజయం సాధించగా, ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు సిరీస్ తో కోహ్లీ, ధోనీ అజేయ టెస్టు సిరీస్ ల రికార్డును దాటేశాడు.

కాగా, కెప్టెన్‌గా కోహ్లీకి ఇది వరుసగా 19వ టెస్ట్ మ్యాచ్ విజయం. దీంతో వరుస టెస్ట్ విజయాలు నమోదు చేసిన కెప్టెన్లలో కోహ్లీ నాలుగో స్థానంలో నలిచాడు. 26 వరుస టెస్ట్ విజయాలతో వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ టాప్‌లో ఉండగా, 22 వరుస విజయాలతో పాంటింగ్ తర్వాత స్థానంలో ఉన్నాడు.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. దరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 208 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది భారత్. 459 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లా నాలుగో రోజు ఆట ముగిసేసరికి 103/3తో నిలిచింది. ఐదో రోజు మిగిలిన ఏడు వికెట్లు 250 పరుగులకు ఆలౌటైంది. దీంతో 208 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది భారత్