ధోని-యువీ.. సెల్ఫీ ఇంటర్ వ్యూ

dhoni

ఎంఎస్‌ ధోని సారధ్యంలో యువరాజ్‌ కి అన్యాయం జరిగిందని యువీ తండ్రి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై వీరి మధ్య కోల్డ్ వార్ కూడా నడిచింది. అయితే ఇప్పుడు యువరాజ్‌ సింగ్‌ మళ్ళీ టీమిండియాలో అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్‌తో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు యువరాజ్‌సింగ్‌ను ఎంపిక చేసింది టీమిండియా. కెప్టన్ భాద్యతల నుండి ఎంఎస్‌ ధోని తప్పుకున్న నేపధ్యంలో జట్టులోకి యువీ రావడం మళ్ళీ చర్చనీయంశమైయింది. అయితే తమ మధ్య ఎలాంటి వైరం లేదని చెప్పే ప్రయత్నం చేశారు వీరు. ధోని తో కలసి యువీ ఓ సెల్ఫి వీడియో ను తీశాడు. ఈ వీడియోలోనే ఇంటర్వ్యూ కూడా చేసేశాడు.

ఇంగ్లాండ్ తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌డ్రెస్సింగ్‌ రూమ్‌లో ధోనితో కలిసి యువరాజ్‌ సెల్ఫీ వీడియో తీశాడు. ఈ సందర్భంగా ఇప్పటివరకు తనకు మార్గనిర్దేశం చేసి నాపై విశ్వాసం ఉంచినందుకు ధోనికి థాంక్స్ చెప్పాడు యువీ. దీంతో పాటు కొన్ని ప్రశ్నలు వేశాడు. భారత్‌ కెప్టెన్‌గా జర్నీ ఎలా అనిపించింది అని అడగగా.. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించడం చాలా ఆనందంగా ఉందని, యువరాజ్‌లాంటి ఆటగాళ్లు జట్టులో ఉంటే నా పని ఈజీ అయిందని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో చూడాల్సిందే.