ఢిల్లీ డేర్ డెవిల్స్ షాక్

jp

ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2017 సందడి మరో రెండు వారాల్లో మొదలుకానుంది. ఇప్పటికే అన్నీ జట్లు రెడీ అయ్యాయి. అయితే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు అప్పుడే ఓ షాక్ తగిలింది. 2015లో ఆ జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన సౌతాఫ్రికా ఆల్ రౌండర్ జేపీ డుమిని వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. డుమిని వైదొలిగాడని ఆ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ హేమంత్ దువా వెల్లడించారు.

డుమిని వైదొలగడం తమను నిరాశపరిచిందని, అయితే ఆయన పరిస్థితిని తాము అర్థం చేసుకోగలమని, ఐపీఎల్‌ నుంచి వైదొలగే క్రమంలో డుమిని ప్రతిభావంతులతో కలిసి ఆడడం గొప్ప అనుభూతి అని, అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పినట్లు వెల్లడించారు. మరి డుమిని స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.