హర్మన్‌ప్రీత్‌ బయోపిక్ లో దీపికపదుకొణె

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ది.. మహిళా భారత క్రికెట్ లో మెరుపు తీగ. బంతిని బలంగా బాదడంలో దిట్ట. వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి ముందు హర్మన్‌ప్రీత్‌ ఎవరికీ తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం ఈజీగా గుర్తుపట్టేశారు. ఆమె లేడీ సెహ్వాగ్ అయిపోయింది. తాజగా ఆమె బయో పిక్ పప్రస్తావన కూడా వచ్చింది.

తాజాగా హర్మన్‌ప్రీత్‌ ఓ క్రీడా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తనపై బయోపిక్‌ తీస్తే నా పాత్రలో బాలీవుడ్‌ తార దీపికా పదుకొణె నటిస్తే బాగుంటుంది’ అని తన మనసులో మాట చెప్పింది. ”అయితే నేను ప్రపంచకప్‌ సాధించిన జట్టులో సభ్యురాలైనప్పుడు బయోపిక్‌ తీస్తే బాగుంటుంది. ఇప్పుడు నా దృష్టంతా టీ20 ప్రపంచకప్‌పైనే. భవిష్యత్తులో ఎన్నో విజయాలు అందుకోవాలని, స్వస్థలమైన మోగాలో క్రికెట్‌ అకాడమీని నెలకొల్పి పురుష, మహిళలకు శిక్షణ అందించాలని ఉంది’ అని తన లక్ష్యం గురించి చెప్పింది హర్మన్‌ప్రీత్‌

Tagged: