పీవీ సింధుకు ఇంటిస్థలం కేటాయింపు

pv sindhu
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిలబెట్టుకొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రియో ఒలింపిక్స్‌లో రజత పతకం విజేత, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు ఇంటి స్థలం కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం . ఈ మేరకు కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

షేక్‌పేట గ్రామంలోని భరణి లే అవుట్‌లో 1000 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ఇప్పటికే పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం నగదు రూపంలో ప్రోత్సాహకాన్ని అందజేసిన విషయం తెలిసిందే.

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాలే కాకుండా మధ్య ప్రదేష్ ప్రభుత్వం కూడా ప్రొత్సాహకాన్ని ప్రకాటించింది. ఇక, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నగదు, ఇంటి స్థలంతో పాటు సింధుకి గ్రూప్ -1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేసిన విషయం తెలిసిందే.