ఆస్ట్రేలియా బెండు తీసిన భారత్

pojara

ఆస్ట్రేలియా బెండు తీసింది భారత్.ఆస్ట్రేలియా బెండు తీసింది భారత్ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత బ్యాట్స్‌మెన్స్ కంగారులకు చుక్కలు చుపించారు. ఛతేశ్వర పుజారా డబల్ సెంచరీ బదేశాడు. 130 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగోరోజు ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పూజారా 521 బంతుల్లో 21 ఫోర్ల సాయంతో డబుల్‌ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో పూజారాకు మూడో ద్విశతకం కావడం విశేషం. మరోపక్క వృద్ధిమాన్‌ సాహా కూడా శతకం నమోదు చేశాడు. వీరిద్దరి భారీ ఇన్నింగ్స్ తో 603 పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసింది టీమిండియా.

మొత్తంమ్మీద మొదటి ఇన్నింగ్ లో 451 పరుగులు చేసిన ఆసీస్ కు అంతే దీటుగా సమాధానం ఇచ్చింది భారత్ .ముఖ్యంగా పూజారా, వృద్ధిమాన్‌ సాహా జోడి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చుపించారు. సహనానికి తీవ్ర పరీక్ష పెట్టారు. ఈ దశలో ఆసీస్ బౌలర్లు విసిగిపోయారు. చక్కని షాట్లతో స్కోర్ ను బోర్డు మెల్లమెల్లగా ఆరువందల క్లబ్ లో తీసుకు వెళ్ళడంలో ఈ జోడి కీలక పాత్ర పోషించింది. 153పరుగుల ఆధిక్యంతో ఇండియా ఇప్పుడు పటిష్టస్థితిలో వుంది.