విజయానికి ఎనిమిది వికెట్లు

virat

ఆస్ట్రేలియాపై పట్టు బిగించింది ఇండియా. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్‌ నాలుగో రోజు పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 610/9 పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసిన భారత్‌ 152 ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

ఈ మ్యాచ్ లో ఓవర్‌నైట్‌ 360/6 స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ బ్యాట్స్‌మెన్లు చెతేశ్వర్‌ పుజారా డబుల్ సెంచరీ తో రాణించాడు. వృద్ధిమాన్‌ సాహా సెంచరీ బాదాడు. ఎనిమిదో వికెట్‌ 199 పరుగులను జోడించారు వీరిద్దరు. మరో బ్యాట్స్ మెన్ రవీంద్ర జడేజా(54) పరుగులతో ఆకట్టుకున్నాడు.

ఇప్పుడు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలింది. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ ఇది. అయితే చివరి రోజు ఎలా వుటుందో చెప్పలేం, భారత్ విజయానికి ఎనిమిది వికెట్లు కావాలి. మన బౌలర్లు ఆ వికెట్లు పడగొట్టేయాలనే ఆశిద్దాం.