డ్రాగా ముగిసిన రాంచీ టెస్ట్

mtach

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రాంచీలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. భారత్‌ విజయానికి ఆసీస్‌ ఆటగాళ్లు మార్ష్‌- హ్యాండ్స్‌కాంబ్‌ జోడీ అడ్డుగోడలా నిలిచింది.

23/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ ఎలాగైనా మ్యాచ్‌ను డ్రాగా ముగించాలన్న కసితో ఆడింది. పరుగుల కోసం ఏ మాత్రం తొందరపడకుండా.. వికెట్‌ కోల్పోకుండా ఆచితూచి ఆడింది. ఒకానొక దశలో మ్యాచ్‌పై పట్టు బిగించింది భారత్. చివరి రోజు ఆటలో మొదట్లోనే రెండు వికెట్లు పడగొట్టారు. అయితే ఈ దశలో వచ్చిన మార్ష్‌- హ్యాండ్స్‌కాంబ్‌ జోడీని విడగొట్టడం భారత బౌలర్ల తరం కాలేదు.

మార్ష్‌- హ్యాండ్స్‌కాంబ్‌ పరమ జిడ్డు ఆట ఆడారు. చివర్లో మార్ష్‌, మ్యాక్స్ వెల్ అవుట్ అయినప్పటికీ అప్పటికే మ్యాచ్ డ్రా దిశగా వచ్చేసింది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు చెరో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమజ్జీవులుగా నిలిచాయి. సిరీస్‌లో చివరి టెస్టు ఈ నెల 25న మదలౌతుంది.