కంగారులను డీ కొట్టే మన జట్టు ఇదే

India unchanged for first two Australia Tests

నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది భారత్. నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే భారత్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌లకుగాను బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేసింది.

భారత జట్టు వివరాలు ఇలా వున్నాయి. విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), విజయ్‌, రాహుల్‌, పుజారా, రహానే, సాహా(వికెట్‌కీపర్‌), అశ్విన్‌, జడేజా, ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌, ఉమేశ్‌ యాదవ్‌, కరుణ్‌ నాయర్‌, జయంత్‌ యాదవ్‌, కుల్‌దీప్‌ ముకుంద్‌, పాండ్యా.

కాగ, నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే భారత్‌లో అడుగుపెట్టింది. సిరీస్‌కు పది రోజులకు పైగా సమయం ఉండగానే స్టీవ్‌ స్మిత్‌ నేతృత్వంలోని కంగారూ జట్టు భారత్‌కు చేరుకుంది. 23న పుణెలో ఆరంభమయ్యే తొలి టెస్టుకు ముందు 17-19 తేదీల మధ్య పాండ్య నేతృత్వంలోని భారత్‌-ఎ జట్టుతో ముంబయిలో వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతుంది ఆస్ట్రేలియా.