సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్

సఫారీ గడ్డపై భారత్ సత్తా చాటింది.టెస్ట్ సిరీస్ లో ఓడిన భారత్ ప్రతీకారం తీర్చుకుంది. వన్డే సిరిస్ ను కైవసం చేసుకుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో దక్షినాఫ్రికా జట్టును 73పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ఒక వన్డే మిగులుండగానే సిరిస్ ను సొంతం చేసుకుంది భారత్.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసింది భారత్. 300పరుగులు సులువుగా చెస్తుందనుకున్న జట్టు 274 పరుగులతో సరిపెట్టుకుంది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (115 )తో పాటు ధావన్‌, కోహ్లీ, శ్రేయస్‌ రాణించడంతో 274 పరుగులు చేసింది.

Also Read :   టీమ్ ఇండియా టార్గెట్ 270 పరుగుల

275పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు.. ఆదిలోనే వికెట్లు చేజార్చుకుంది. ఆమ్లా ఒక్కడే 77పరుగులతో రాణించాడు. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు.

Tagged: , ,