టీ20 వరల్డ్‌ కప్‌ మనదే

ind

అంధుల ట్వంటీ 20 వరల్డ్ కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ జట్టు టైటిల్ను చేసుకుంది.ఈ రోజు పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ను మరోసారి ఎగురేసుకుపోయింది. పాకిస్తాన్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 197 పరుగుల చేసింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఓపెనర్లు అదిరే షాట్లతో 17.4 ఓవర్లలోనే ఒక్క వికెట్‌ నష్టానికి ఏకంగా 200 పరుగులను ఈజీగా చేసి విజేతగా నిలిచారు. భారత్‌ బ్యాట్స్‌మెన్లలో ప్రకాశ్‌ జయరామయ్య 99 పరుగుల చేసి నాటౌట్‌గా నిలవగా, కెప్టెన్ అజయ్‌కుమార్‌ రెడ్డి (43), కేతన్‌ పటేల్‌ (23) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.