అయ్యో.. సన్‌రైజర్స్‌ కధ ముగిసింది


ఐపీఎల్‌ పదో సీజన్‌ నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కధ ముగుసింది. టోర్నీ నుండి నిష్క్రమించింది. ఎలిమినేటర్‌ పోరులో వరుణుడు కోల్‌కతాకు అనుకూలించాడు. సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం నిర్దేశించిన 48 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 5.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో కోల్‌కతా క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌కు అర్హత సాధించగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు పిచ్‌ నుంచి ఆశించిన సహకారం అందలేదు. మందకొడిగా ఉండడంతో పరుగులు తీసేందుకు తెగ ఇబ్బంది పడింది. దీంతో సన్‌రైజర్స్‌ 128పరుగులకే కే పరిమితమైంది. అనంతరం వరుణుడు కూడా కోల్‌కతాకు అనుకూలించాడు. తొలి ఇన్నింగ్స్‌ అనంతరం వర్షం కారణంగా మ్యాచ్‌ చాలా సేపు నిలిచిపోయింది. దీంతో మ్యాచ్‌లో ఓవర్లను కుదించారు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 6 ఓవర్లలో కోల్‌కతాకు 48 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ టార్గెట్ ను ఫినిష్ చేసిన కోల్ కత్తా క్వాలిఫయర్‌-2 లో అడుగుపెట్టింది.

Tagged: , ,