మనదే గెలుపు అంటున్న టీం ఇండియా..

india-vs-australia

ఆసీస్ తో జరుగుతున్న చివరి టెస్ట్ లో ఖచ్చితంగా విజయం సాధించాలని టీం ఇండియా కసరత్తులు మొదలుపెట్టింది. తొలి ఇన్నింగ్స్‌ను 603/9 వద్ద డిక్లేర్‌ చేసిన భారత్‌ జట్టు ఆసీస్‌పై 152పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. మ్యాచ్‌ ఫలితం ఈరోజు తేలాల్సి ఉండటంతో భారత ఆటగాళ్లు ఎలాగైన గెలవాలన్న కసితో ప్రాక్టీసు చేసారు.

last-test-match-india-vs-au

సోమవారం ఉదయం ప్రాక్టీసు సమయంలో భారత ఆటగాళ్లు ఫీల్డింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు . ఈ టెస్టులో ఫీల్డింగ్‌లో కొన్నిసార్లు అనవసర తప్పిదాలతో భారత ఆటగాళ్లు ఆసీస్‌కు పరుగులు ఇచ్చిన సంగతి తెల్సిందే. కీలక సమయంలో ఇలాంటి తప్పిదాలు చేయకూడదని, ఎలాగైన మూడో టెస్టులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని ఫీల్డింగ్‌.. బౌలింగ్‌పైనే భారత ఆటగాళ్లు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మరి విజయం ఎవర్ని వారిస్తుంది అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది..

Tagged: ,