ముంబై ఇండియన్స్‌ మెరుపుదాడి

rana

ఐపీఎల్‌ పదో సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ చెలరేగుతోంది. 199 పరుగుల లక్ష్యాన్ని ఏమాత్రం తడబడకుండా 15.3 ఓవర్లలోనే ఛేదించగలిగింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి బ్యాట్స్‌మెన్‌ పోటాపోటీగా వీరబాదుడు బాదారు. బట్లర్‌, నితీష్‌ రాణా ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ముంబయి ఇండియన్స్‌ 8 వికెట్ల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది.

ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. 198పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబాయి ముందు వుంచింది. హషీమ్‌ ఆమ్లా సెంచరీతో చేలరిగిపోయాడు. అంరో ఎండ్ లో మ్యాక్స్ వెల్ కూడా మెరుపు ఇన్నింగ్ ఆడాడు. దీంతో 198పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబాయి ముందు వుంచింది పంజాబ్.

Also Read :   అయ్యో.. ముంబయి

ఛేజింగ్ కు దిగిన ముంబాయి ఈ స్కోర్ ను ఉఫ్ న ఊదేసింది. జోస్‌ బట్లర్‌ సంచలన ఇన్నింగ్స్‌కు తోడు పార్థివ్, నితీశ్‌ రాణాల మెరుపు ఆటతో ముంబై ఇండియన్స్‌ 199 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. మరో 27 బంతులు మిగిలి ఉండగానే కింగ్స్‌ ఎలెవన్‌ను చిత్తు చేసి వరుసగా ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో ముంబై మళ్లీ అగ్రస్థానానికి చేరింది.

Tagged: