మిథాలిపై ప్రశంసల జల్లు

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాల్లి రాజ్ రికార్డ్ సృష్టించారు. అత్యధిక పరుగులు (5992) రికార్డును అధిగమించడమే కాక 6వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గానూ రికార్డు సాధించారు. వరల్డ్ కప్ లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో మిథాలి ఈ రికార్డుని చేరుకొన్నారు. అంతకు ముందు ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్‌వర్డ్స్‌ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. ఎడ్‌వర్డ్స్‌ ఈ మైలురాయిని 191 మ్యాచ్‌ల్లో సాధించగా.. మిథాలీ కేవలం 183 మ్యాచ్‌ల్లోనే చేరుకున్నారు.

Also Read :   ఫుట్‌బాల్‌ అభిమానులకు శుభవార్త

అత్యధిక పరుగుల ఘనత సాధించిన మిథాలీపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, భారత మాజీ కోచ్ అనిల్ కుంబ్లే, గౌతమ్‌ గంభీర్‌ తదితరులు అభినందించారు. ప్రశంసల జల్లు కురుస్తోంది. మహిళల క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించడం గొప్ప క్షణాలు అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసించాడు. ‘గొప్ప మైలురాయిని అందుకున్నావ్‌’ అంటూ మిథాలీకి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ అభినందనలు తెలిపారు. ‘భారత్‌ పరుగుల మెషిన్‌’ అంటూ గౌతమ్‌ గంభీర్‌ రాసుకొచ్చాడు.

Also Read :   కోచ్ పదవి కొనసాగుతున్న ఉత్కంఠ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే లు మిథాలీని ప్రశంసిస్తూ ట్విట్ చేశారు. వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించి జాతి గర్వించ దగ్గ ఘనత సాధించావని ప్రశంసిస్తూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

ఇక, వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. దీంతో భారత్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి.