బ్రేకింగ్ : కెప్టెన్సీకి ధోనీ గుడ్ బై

dhoni
భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ శకం ముగిసింది. తాజాగా, టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్సీకి ధోని తప్పుకొన్నారు. ఈ మేరకు ధోని బీసీసీఐకి సమాచారం అందించారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ధోని సడెన్ డిసిషియన్ పై ఆయన అభిమానులు షాక్ కి గురవుతున్నారు.

కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని సడెన్ గా తప్పుకోవడంతో.. ఇంగ్లండ్ తో జరనున్న వన్డే సిరీస్ కోసం కెప్టెన్ గా కోహ్లీని ని ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, ధోనీ కెప్టెన్ నుంచి మాత్రమే తప్పుకొన్నా.. ఆటగాడిగా టీంలో కొనసాగుతానని ధోని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

అయితే, ఇంగ్లండ్ వన్డే సిరీస్ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకోవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. వాటికి విభిన్నంగా ధోని అంతకు ముందే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం విశేషం. గతంలోనూ టెస్ట్ కెప్టెన్ నుంచి కూడా ధోని సడెన్ గా తప్పుకొన్న విషయం తెలిసిందే. ఏదేమైనా.. కెప్టెన్ గా టీమిండియాకి చిరస్మరణీమైన విజయాలు అందించిన ధోని కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.