నాయకుడు వెల్ కం చెప్పేశాడు

ఐపీఎల్ అభిమానులకి గుడ్ న్యూస్. చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుపై నిషేదం ముగిసింది. చెన్నై, రాజస్థాన్ రాయల్స్ జట్ల యాజమాన్యాలు బెట్టింగ్‌కు రుజువైన విషయం తెలిసిందే. ఈ రెండు జట్లపై రెండేళ్ల పాటు నిషేధం పడింది. దీంతో 2016, 2017 ఐపీఎల్ సీజన్లకు చెన్నై, రాజస్థాన్ జట్లు దూరమయ్యాయి.

గురువారంతో ఈ జట్లపై రెండేళ్ల నిషేదం ముగింది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సంతోషంగా ప్రకటించింది. ‘సింహాలకు శుభోదయం..! ఎట్టకేలకు ఎదురుచూపులు
ముగిశాయి. మళ్లీ ఎదిగేందుకు, దేదీప్యమానంగా వెలిగేందుకు సమయం వచ్చింది..’ అంటూ చైన్నై సూపర్ కింగ్ యాజమాన్యం ట్విట్ చేసింది.

Also Read :   కోల్ కత్తాపై హైదరాబాద్‌ గెలుపు.. ఇలా !

తాజాగా, టీమిండియా, చెన్నై సూపర్ కింగ్ జట్ల మాజీ కెప్టెన్ ధోని కూడా ఆ జట్టుకి ఘన స్వాగతం పలికాడు. త‌న ఇంటి ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ జెర్సీ ధ‌రించి
ఉన్న ఫొటోను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ జెర్సీ మీద త‌న పేరుకి బ‌దులుగా `త‌ళ‌` అని ఉంది. `త‌ళ‌` అంటే త‌మిళంలో `నాయ‌కుడు` అని
అర్థం. అంటే సీఎస్‌కే జ‌ట్టుకు మ‌ళ్లీ ధోనీ నాయ‌క‌త్వం వహించబోతున్నాడన్న మాట.