పుజారా శతకొట్టుడు

pojara

రాంచీ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జట్ల మ‌ధ్య‌ జరుగుతున్న మూడో టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో పుజారా అద‌ర‌గొట్టాడు. 218 బంతుల‌ను ఎదుర్కొన్న పుజారా సెంచ‌రీ చేశాడు. పుజారాకు ఇది 11వ టెస్టు శతకం కాగా ఆసీస్‌పై రెండోది.

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. మూడో రోజు, మూడో సెషన్‌ కరుణ్‌ నాయర్‌ 23పరుగుల వద్ద ఔటయ్యాడు. హేజిల్‌వుడ్‌ వేసిన బంతిని ఆడబోయి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. కరుణ్‌ నిష్క్రమణతో అశ్విన్‌ క్రీజులోకి వచ్చాడు .ఛతేశ్వర్‌ పుజారా, అశ్విన్‌ లు ప్రస్తుతం ఆసీస్ ను ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం టీమిండియా 118పరుగులు వెనకబడి వుంది.

Tagged: , ,