రికార్డ్ : 6 బంతులకి.. 6 వికెట్లు

ఓకే ఓవర్ లో ఆరు సిక్సులు బాది భారత డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఒకే ఓవరులో 6 వికెట్లు తీయడం ఊహించగలమా.. ? ఇప్పటి వరకు హాట్రిక్ వికెట్స్ మాత్రమే చూశాం అది కూడా చాలా అరుదుగా. అయితే, ఇప్పుడు 6 బంతుల్లో 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు ఓ క్రికెటర్. అయితే, ఇది జాతీయ స్థాయిలో కాదు. అండర్-13 క్రికెట్ టోర్నీలో ఈ రికార్డు నమోదైంది.

Also Read :   తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో మ్యాచ్

ఫిలిడెల్పియా క్రికెట్ క్లబ్ తరపున అండర్-13 క్రికెట్ టోర్నీలో బరిలోకి దిగిన ల్యూక్ రాబిన్ సన్ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు సాధించాడు. ఈ ఆరు వికెట్లూ బౌల్డ్ రూపంలో సాధించడం మరో విశేషం. ఈ ఘనత సాధించడం పట్ల రాబిన్ సన్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరో విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్ కి రాబిన్ సన్ తండ్రి ఎంపైర్ గా వ్యవహరించారు. తల్లి స్కోరర్ గా పని చేసింది. తనయుడు ఘనతని దగ్గర నుంచి చూసిన రాబిన్ సన్ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవ్. మరి.. ఈ బుడతడు భవిష్యత్ క్రికెట్ స్టార్ గా ఎదగాలని ఆశిద్దాం.