రోజర్‌ ఫెదరర్‌.. సరికొత్త చరిత్ర


స్విస్‌ టెన్నిస్‌ సూపర్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వింబుల్డన్ లో రోజర్ ఫెదరర్ ఎవరికీ అందని మైలు రాయి దాటాడు. 8వసారి ఛాంపియన్ గా నిలిచాడు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో క్రొయేషియా క్రీడాకారుడు మారిన్ సిలిక్ పై ఘన విజయం సాధించాడు. సిలిక్ పై 6-3, 6-1,6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ విజయంతో ఫెదరర్ కెరీర్ లో 8వ వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ సాధించినట్టయింది.

Also Read :   విండీస్ ను చిత్తు చేసిన భారత్

గతంలో పీట్ సంప్రాస్ వింబుల్డన్ టైటిల్స్ సాధించాడు. తాజా విజయంతో ఫెదరర్ ఈ రికార్డును అధిగమించాడు. 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012లో వింబుల్డన్ టైటిళ్లను ఫెదరర్ సాధించాడు. 2012లో ఆండీ ముర్రేను ఓడించి, వింబుల్డన్ టైటిల్ ను ఫెదరర్ సొంతం చేసుకున్నాడు. 2014, 2015 వింబుల్డన్ సింగిల్స్ లో ఫెదరర్ రన్నరప్ గా నిలిచాడు. 35 ఏళ్ల వయసున్న ఫెదరర్‌కు ఇది ఎనిమిదో వింబుల్డన్‌ టైటిల్‌ కాగా 11వ ఫైనల్‌. మొత్తం మీద 19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌.