సాహో .. టీమిండియా

టెస్ట్ క్రికెట్ లో శభారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. రికార్డులను చెరిపివేస్తూ సరికొత్త ఘనతలు లిఖిస్తూ టెస్ట్‌ క్రికెట్‌ను శాసించే దిశగా సాగిపోతోంది టీమిండియా. వరుసగా ఎనిమిదో సిరీస్‌ కైవసం చేసుకొంది. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టెస్టు గెలిచి 2-0తో సిరీస్‌ కైవసం చేసుకొంది భారత్.

మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భారీ విజయం సాధించిన భారత జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. రెండోఇన్నింగ్స్ లో శ్రీలంకను 386 పరుగుల వద్ద ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది.

Also Read :   దీన్నే బలుపు అంటారు

209/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన లంకేయులు జడేజా ఐదు వికెట్లతో చెలరేగడంతో చాప చుట్టేశారు. దాంతో సిరీస్ ను ఇంకా టెస్టు మ్యాచ్ మిగిలిఉండగానే 2-0తో చేజిక్కించుకుంది. సిరీస్‌లో చివరిదైన నామమాత్రపు మూడో టెస్టు శనివారం ప్రారంభమవుతుంది.