ధోనిని ఓ కోరిక కోరిన సచిన్

dhoni

భారత క్రికెట్ కు దూకుడు నేర్పిన నాయకుడతడు. కలగానే మిగిలిపోతుందనుకున్న ‘వరల్డ్ కప్’ స్వప్నాన్ని, భారత క్రికెట్‌ ప్రేమికుల కోటి ఆశలను నిజం చేసిన ధీరుడతడు. వన్డే ప్రపంచ కప్‌, ట్వంటీ20 ప్రపంచ కప్‌…. ఛాంపియన్స్‌ ట్రోఫీ.. టెస్టుల్లో నెంబర్‌వన్‌, ఛాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌.. ఇలా అన్నీ ఫార్మేట్ క్రికెట్లో తనదైన నాయకత్వం వహించి భారత క్రికెట్ లో చెరగని ముద్రవేశాడు. అతడే.. కెప్టెన్‌ కూల్‌ మహేంద్రసింగ్‌ ధోనీ.

ఇండియన్ క్రికెట్ లో ధోని ఓ సంచలనం. అతడి నిర్ణయాలు కూడా సంచలనం. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకునాడు. ఇప్పటికే టెస్ట్ కెప్టెన్సీ నుండి తప్పుకున్న ధోని తాజగా వన్దే , , ట్వంటీ20 ఫార్మేట్ కెప్టెన్సీ బాధ్యతలను నుండి తప్పుకున్నాడు. ఈ నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చింది. ఇంత అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమైవుంటుంది ? అనే సందేహాలు సర్వాత్ర వ్యక్తమయ్యాయి.

కాగా, ధోని నిర్ణయం పై క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ స్పదించారు. ధోనీ నిర్ణయాన్ని గౌరవించాలని చెప్పారు సచిన్. కెప్టెన్‌గా ధోనీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారాయన. తాను ఆటగాడిగా ధోనిదూకుడు, కెప్టెన్‌ కూల్‌గా తనని తాను మలచుకున్న విధానాన్ని చూశానని, నిర్ణయాలు తీసుకోవడంలో ధోని తీరు అద్భుతంగా ఉటుందన్న సచిన్, ఆటగాడిగా ధోని మరింత కాలం అలరించాలని కోరారు.