పల్లెకలె టెస్ట్ : తొలిరోజు భారత్ 329/6

లంక పర్యటనలో భాగంగా భారత్ – శ్రీలంకల మధ్య పల్లెకలె వేదికగా జరుగుతోన్న మూడు/ఆఖరి టెస్టు తొలిరోజు ఆట రసవత్తరంగా సాగింది. మొదట టీమిండియా జోరుని చూపిస్తే.. ఆ తర్వాత లంక లైన్ లోకి వచ్చి ఆటపై ఆసక్తిని పెరిగేలా చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓ పెనర్లు శిఖర్ ధావన్ (119), రాహుల్ (85) శుభారంభం చేశారు. తొలి వికెట్ కు 188 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో పలు రికార్డులని బ్రేక్ చేశారు.. ఈ ఓపెనర్స్.

Also Read :   కోచ్ పదవి నుండి తప్పుకున్న కుంబ్లే

అయితే, ఆ తర్వాత టీమిండియా స్వీడుకి లంక బౌలర్లు వేయగలిగారు. రాహుల్ (85) అవుటయ్యాక క్రీజ్ లోకి వచ్చిన చటేశ్వర్ పుజారా (8)ని త్వరగానే పెలివియన్ పంపింది. కెప్టెన్ కోహ్లీ 42, రహానె 17, రవిచంద్రన్ అశ్విన్ 31 పరుగులు చేసి ఔటయ్యారు. తొలిరోజు భారత్ 329/6 గా నిలిచింది. ప్రస్తుతం వృద్ధిమాన్ సాహా 13 పరుగులతో, హార్దిక్ పాండ్యా ఒక్క పరుగుతో క్రీజ్ లో ఉన్నారు.

రెండో రోజు భారత్ స్కోర్ ని 500పరుగులకి దగ్గర చేయగలిగితే.. మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చినట్టే. లేదంటే లంకతో హోరాహోరి తప్పదు.