టీం ఇండియా జోరు కొనసాగి నెం.1 అయ్యేనా?

శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడివ్వడంతో చాలా ఆత్మ విశ్వాసంతో ఆసీస్‌ జట్టును ఎదుర్కొనేందుకు టీం ఇండియా సిద్దం అయ్యింది. ఇక బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమిని మర్చిపోలేక ఇంకా కుమిలి పోతున్న స్థితిలో ఆస్ట్రేలియా ఉంది. ఈ రెండు జట్ల మద్య త్వరలో ప్రారంభం కాబోతున్న వన్డే సిరీస్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎంతో ఆసక్తిగా సాగనున్న ఈ సిరీస్‌ను టీం ఇండియా ఫెవరెట్‌గా ఆరంభించబోతుంది. కాని ఆస్ట్రేలియాను కూడా అంత తేలికగా తీసుకోవద్దని మాజీ ఆటగాళ్లు చెబుతున్నారు.

Also Read :   2019 వరల్డ్ కప్ : ఫైనల్'లో భారత్ - పాక్

ఈ సిరీస్‌లో టీం ఇండియా క్లీన్‌ స్వీప్‌ చేసినట్లయితే వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానం ఖాయం అంటూ క్రీడా పండితులు చెబుతున్నారు. అయితే ఆస్ట్రేలియాతో సిరీస్‌ అంటే అంత సింపుల్‌ ఏమీ కాదని జట్టు సభ్యులు గుర్తించాలి. తాజాగా జరిగిన సన్నాహక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన సత్తాను చాటి టీం ఇండియాకు గట్టి సవాలు విసిరిందని చెప్పుకోవచ్చు.

సన్నాహక మ్యాచ్‌ ఫలితం తర్వాత టీం ఇండియా తమ ఆయుదాలకు ఖచ్చితంగా పదును పెట్టాల్సిందిగా అభిమానులు కోరుకుంటున్నారు. టీం ఇండియాను తాము తక్కువగా అంచనా వేయబోం అంటూనే ఆస్ట్రేలియా ఇండియాను ఇండియాలో ఓడివ్వాలని విశ్వ ప్రయత్నాలు చేయబోతుంది. మరి ఈ సిరీస్‌ ఎలా సాగుతుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

loading...