కోహ్లీ తో పెను ప్రమాదం

virta

వరుస విజయాలతో టీమిండియా దూసుకుపోతుంది. వరుస విజయాలతో ఇప్పుడు టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంకు చేరుకుంది టీమిండియా. న్యూజీలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్.. ఇలా వరుస జట్లను ఓడించి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది ఇపుడు ఆస్ట్రేలియా తో తలపడనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే భారత్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ పైనే అందరి కళ్ళు.

భారత్ లో అడుగుపెట్టిన సందర్భంగా ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మీడియాతో మాట్లాడాడు. టీమిండియా తమకు సరైన ప్రత్యర్ధి అన్నాడు. కెప్టెన్ కోహ్లీ గురించి బాగా తెలుసని, కోహ్లీపై తాము ప్రత్యేక పథకాలు సిద్దం చేసుకున్నామని, వరుసగా నాలుగు టెస్ట్ సిరీస్‌లలో డబుల్ సెంచరీలు సాధించడమంటే మామూలు విషయం కాదని, అలాంటి కోహ్లీతోనే తమకు ముప్పు ఉందని అభిప్రాయపడ్డాడు స్టీవ్ స్మిత్