మాక్స్‌వెల్‌ కు విరాట్ పంచ్

virat

భారత్‌, ఆస్ట్రేలియా సిరీస్‌ లో స్లెడ్జింగ్ కనిపిస్తుంది. ఇరు జట్లు తగ్గడం లేదు. ఎవరీ వారు కవ్వింపులు చర్యలకు పాల్పడుతున్నారు . మూడో మ్యాచ్ మొదటి రోజు ఫీల్డింగ్‌ సందర్భంగా విరాట్‌ భుజానికి గాయమై మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా బౌండరీ లైన్‌ వద్ద బంతిని ఆపిన ఆసీస్‌ ఆటగాడు మాక్స్‌వెల్‌ వెటకారంగా భుజాన్ని పట్టుకొని విరాట్ ను గేలి చేశాడు.

ఇప్పుడు కోహ్లీ వంతువచ్చింది. నాలుగో రోజుఆటలో 152 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ను భారత్‌ బౌలర్లు ఆరంభంలోనే దెబ్బకొట్టారు. జడేజా బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ బౌల్డయ్యాడు. దీంతో తనను వెక్కిరించిన మాక్స్‌వెల్‌కు పంచ్‌ ఇస్తూ అదే విధంగా కోహ్లీ కూడా భుజం పట్టుకొని వెక్కిరించాడు. దీంతో చిన్నబోవడం మ్యాక్స్ వెల్ వంతైయింది. లాస్ట్ పంచ్ మనదైతే అ కిక్కే వేరు కదా.

Tagged: ,