వరల్డ్ కప్ : సెమీస్ కి టీమిండియా

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో మిథాలీ సేన అదరగొట్టింది. న్యూజిలాండ్‌పై 186 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. తొలుత . కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (109) అద్భుత శతకంతో రాణించి వన్డేల్లో 6వ శతకం తన ఖాతాలో వేసుకుంది. వేద కృష్ణమూర్తి 70, హర్మన్‌ ప్రీత్‌ 60 పరుగులతో రాణించడంతో.. నిర్ణీత 50ఓవర్లలో భారత్‌ 265/7 పరుగులు చేసింది.

266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 25.3 ఓవర్లకు 75 పరుగులకే చేతులెత్తేసింది. సాటర్ వైట్ (26), మార్టిన్ (12) మినహా బ్యాట్స్ విమెన్లు అందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్‌ 5, దీప్తి శర్మ 2, జులన్‌, శిఖ, పూనమ్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీశారు.

Also Read :   కుంబ్లే బాటలో శ్రీలంక కోచ్

ఆథిత్య ఇంగ్లండ్, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత జట్లు సెమీ ఫైనల్‌కు చేరాయి. ఈ నెల 18న ఇంగ్లండ్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. 20న రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది.

Tagged: