ధోని వెళ్ళాడు.. యువీ వచ్చాడు

yuvi

యువరాజ్‌ సింగ్‌ మళ్ళీ టీమిండియాలో అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్‌తో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు యువరాజ్‌సింగ్‌ను ఎంపిక చేసింది టీమిండియా. కెప్టన్ భాద్యతల నుండి ఎంఎస్‌ ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. ఎంఎస్‌ ధోని సారధ్యంలో యువీని తొక్కిపెడుతున్నారన్న ఆరోపణ వుంది. ఇప్పుడు కెప్టన్ గాధోని తప్పుకోవడంతో విరాట్‌ కోహ్లీ భాద్య తలు తీసుకువడం, జట్టులోకి యువీ రావడం మళ్ళీ చర్చనీయంశమైయింది.

జట్టు ఎంపిక వివరాలు ఇలా వున్నాయి

వన్డే జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), ఎంఎస్‌ ధోని (వికెట్‌ కీపర్‌), కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, యువరాజ్‌ సింగ్‌, అజింక్య రహానె, హార్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అమిత్‌ మిశ్రా, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌.

టీ20 జట్టు: విరాట్‌ కోహ్లి (కె), ఎంఎస్‌ ధోని (వి), మన్‌దీప్‌, కేఎల్‌ రాహుల్‌, యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, రిషబ్‌పంత్‌, హార్దిక్‌ పాండ్య, అశ్విన్‌, జడేజా, యజువేంద్ర చాహల్‌, మనీశ్‌, బుమ్రా, భువనేశ్వర్‌, ఆశిష్‌ నెహ్రా