మహీంద్రా నుండి ‘టీయూవీ-300 ప్లస్‌’

వాహనప్రియులకు ఎప్పటికిప్పుడు సరికొత్త మోడల్స్ ను అందించే మహీంద్రా తాజాగా ‘టీయూవీ-300 ప్లస్‌’ పేరిట సరికొత్త వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ మినీ స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం లో తొమ్మిది సీట్ల సామర్థ్యం కలిగి ఉండడం విశేషం.

ఈ వాహనాన్ని పీ4,పీ6,పీ8 పేర్ల‌తో మూడు వేరియెంట్ల‌ను విడుదల చేసారు. టీయూవీ 300 ప్ల‌స్ పీ4 ధరను కంపెనీ రూ.9.47 లక్షలుగా (ఎక్స్‌షోరూం, ముంబయి) నిర్ణయించింది. ఈ వాహనం యొక్క ప్రత్యేకతలు చూస్తే..

* 2.2 లీటరు ఎంహెచ్‌ఏడబ్ల్యూకేడీ 120 సామర్థ్యంతో కూడి ఎంహాక్‌ ఇంజిన్‌
* 17.8 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌
* జీపీఎస్‌ నావిగేషన్‌, 4 స్పీకర్లు, 2 ట్యూటర్లు
* ఈసీఓ మోడ్‌, మైక్రో హైబ్రిడ్‌ టెక్నాలజీ, బ్లూసెన్స్‌ యాప్‌
* ఈసీఓ మోడ్‌, బ్రేక్‌ ఎనర్జీ రీజెనరేషన్‌ టెక్నాలజీ
* ఇంటెలిపార్క్‌ రివర్స్‌ అసిస్ట్‌, డ్రైవర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఈ వాహనం అదనపు ప్రత్యేకతలు.