హోండా 2018 ఏవియేటర్‌ ప్రత్యేకతలు చూసారా..?

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా..తాజాగా 2018 ఏవియేటర్‌ ను విడుదల చేసింది. ఏవియేటర్‌ స్టాండర్డ్‌, అల్లారు డ్రమ్‌, అల్లారు డిస్క్‌ అనే మూడు విభిన్న వేరియంట్లలో ఈ వాహనం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఏవియేటర్‌ ప్రత్యేకతలు చూస్తే..

* హోండా యాక్టివా 125 స్కూటర్‌ తరహాలో 2018 ఏవియేటర్‌ స్కూటర్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, పగటి పూట వెలిగే ఎల్‌ఈడీ లైట్లు, 4-ఇన్‌-1 ఇగ్నిషన్‌ స్విచ్‌, సీట్‌ ఓపెనింగ్‌, రిట్రాక్టబుల్‌ ఫ్రంట్‌, రియర్‌ హుక్స్‌, అలాగే, మెటల్‌ మఫ్లర్‌ ప్రొటెక్టర్‌తో పాటు బ్లూ-బ్యాక్‌ లైటింగ్‌ గల ఇంస్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉంది.

* మునుపటి 109 సీసీ కెపాసిటి గల సింగల్‌ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజన్‌ అందించారు.

* సరికొత్త పర్ల్‌ స్పార్టన్‌ రెడ్‌ కలర్‌ ఆప్షన్‌లో పరిచయమైంది. ఇది వరకు లభించే పర్ల్‌ ఇగ్నియస్‌ బ్లాక్‌, మ్యాట్‌ సెలెన్‌ సిల్వర్‌ మెటాలిక్‌, పర్ల్‌ అమేజింగ్‌ వైట్‌ రంగుల్లో ఎంచుకోవచ్చు. వీటికి అదనంగా పలు కాస్మొటిక్‌ మెరుగులు జోడించారు.

* ముందు వైపున 12-అంగుళాలు, వెనుకవైపున 10-అంగుళాల అల్లారు వీల్స్‌ వాటికి 90/100 కొలతల్లో ఉన్న టైర్లను అందించారు.

* సస్పెన్షన్‌ పరంగా ముందు టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్క్స్‌, వెనుకవైపున డ్యూయల్‌ షాక్‌ అబ్జార్లు ఉన్నాయి.

* బ్రేకింగ్‌ విధులు నిర్వర్తించడానికి ముందువైపున ఆప్షనల్‌ 190 ఎమ్‌ఎమ్‌ ఫ్రంట్‌ డిస్క్‌, వెనుక వైపున 130 ఎమ్‌ఎమ్‌ డ్రమ్‌ బ్రేక్‌ ఉంది. మెరుగైన బ్రేకింగ్‌ కోసం ఏ ఒక్క బ్రేక్‌ అప్లరు చేసినా రెండు చక్రాలకు సమానమైన బ్రేకింగ్‌ పవర్‌ అందేలా కాంబి బ్రేకింగ్‌ సిస్టమ్‌ అందించారు.

* ఇందులో 125 సీసీ స్కూటర్ల తరహా 6-లీటర్ల కెపాసిటీ గల ఫ్యూయల్‌ ట్యాంక్‌ ఉంది.

* 106 కిలోల బరువున్న ఏవియేటర్‌ గంటకు 82 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది కంపెనీ చెపుతుంది.