మార్కెట్లోకి పల్సర్ నియాన్..

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్‌ ..తాజాగా నూతన పల్సర్ నియాన్ ను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ బైక్ లో సరికొత్త హెడ్‌ల్యాంప్‌ బ్రౌస్‌, బ్యాడ్జెస్‌, సైడ్‌ప్యానెల్‌ మెష్‌, గ్రాబ్‌ రెయిల్‌ వంటివి ఉన్నట్లు తెలుస్తుంది.

మరిన్ని ఫీచర్లు చూస్తే..

* 149సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ 8000 ఆర్‌పీఎం వద్ద 14బీహెచ్‌పీ శక్తి
* 13.4ఎన్‌ఎం టార్క్‌
* ముందుభాగంలో 240 ఎంఎం డిస్క్‌ బ్రేక్‌
* వెనుక చక్రానికి 130 ఎంఎం డ్రమ్‌ బ్రేక్‌ను అమర్చారు.
* నియాన్‌ రెడ్‌, నియాన్‌ ఎల్లో, నియాన్‌ సిల్వర్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.
* ఢిల్లీ ఎక్స్‌ షోరూం ధర రూ.64,998గా కంపెనీ నిర్ణయించింది.