మార్కెట్లోకి హీరో డెస్టినీ 125

హీరో మోటార్స్ నుండి మరోవాహనం మార్కెట్లోకి వచ్చి వాహనప్రియులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఎన్నో రకాల మోడల్స్ ను అందించిన హీరో..తాజాగా హీరో డెస్టినీ 125 పేరిట సరికొత్త ద్విచక్ర వాహనాన్ని తీసుకొచ్చింది. ఈ డెస్టినీ 125 ఎల్ఎక్స్, వీఎక్స్ అని రెండు వైరిటీల్లో అందుబాటులో ఉండనుంది.

ఈ ఎల్ఎక్స్ ధర రూ.54,650 గా , వీఎక్స్ ధర మాత్రం రూ.57,500 గా నిర్ణయించారు. ఈ వాహన లుక్ విషయానికి వస్తే హీరో డ్యూట్ 110cc మాదిరిగా ఉంటుంది.

ఈ బైక్ ఫీచర్లు చూస్తే..

* ఫ్రంట్ డిస్క్ బ్రేక్
* ఇంటిగ్రేటెట్ బ్రేకింగ్ సిస్టమ్
* సైడ్ స్టాండ్ ఇండికేటర్స్
* సర్వీస్ రిమైండర్
* పాస్ స్విచ్ లాంటవి ఉన్నాయి.